జగన్ పులివెందుల పర్యటన రద్దు, ఇక నేరుగా- కీలక పరిణామాలు..!!
స్థానిక ఎన్నికల వేళ రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మున్సిపల్ నామినేషన్ల సమయంలో చోటు చేసుకున్న ఘర్షణలతో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది. నేటి నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు దాఖలు అవుతున్నాయి. కడప జిల్లాలో ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఈ సమయంలోనే పులివెందులకు వెళ్లాల్సిన జగన్ ఆకస్మికంగా తన పర్యటన రద్దు చేసుకున్నారు. కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజా పరిణామాలు రాజకీయంగా ఉత్కంఠ పెంచుతున్నాయి.
మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సమయంలో చోటు చేసుకున్న పరిణామాల వేళ జగన్ తాడేపల్లి వచ్చారు. ఎన్నికల సంఘం, గవర్నర్ కు తన పార్టీ కేడర్ పైన జరుగుతున్న దాడుల గురించి ఫిర్యాదు చేసారు. ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ సొంత జిల్లా కడపలో పలు మున్సిపాల్టీలు ఏకగ్రీవం అయ్యాయి. పులివెందులలో ఛైర్మన్ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. దీంతో పాటుగా ఈ రోజు నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు దాఖలు కానున్నాయి. ఈ సమయంలోనే జగన్ పులివెందుల వెళ్లాలని నిర్ణయంతో షెడ్యూల్ ఖరారైంది. కాగా.. ఇప్పుడు తన పులివెందుల పర్యటనను రద్దు చేసుకున్నారు. దీంతో.. బెంగళూరు నుంచి నేరుగా విజయవాడకు ఆయన పయనమయ్యారు. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన తన ప్రణాళికలను మార్చుకున్నట్లు సమాచారం.

జగన్ కీలక మంత్రాంగం
జెడ్పీటీసీ.. ఎంపీటీసీ నామినేషన్లు ప్రారంభం వేళ పార్టీ నేతలకు అందుబాటులో ఉండాలని జగన్ నిర్ణయించారు. అదే విధంగా సుప్రీంకోర్టులో వైసీపీ పిటీషన్ల పైన విచారణ జరగనుంది. ఏకగ్రీవాల తో పాటుగా అభ్యర్ధులకు భద్రత పైన వైసీపీ సుప్రీంను ఆశ్రయించింది. ఇక.. మున్సిపల్ తరహాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు తమ పార్టీ అభ్యర్ధులను నామినేషన్లు వేయనీయని పరిస్థితి వస్తే ఏ రకంగా స్పందించాలనేది జగన్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. తాను అందుబాటులో ఉంటూ.. ఎన్నికల సంఘంతో సంప్రదింపులు చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అయితే, పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లతో జగన్ ఒన్ టు ఒన్ మాట్లాడారు. మున్సిపల్ ప్రచారం తో పాటుగా జెడ్పీటీసీ నామినేషన్లు.. పోలింగ్ విషయంలో కీలక దిశా నిర్దేశం చేసారు. దీంతో.. జగన్ కొత్త వ్యూహాలు రాజకీయంగా కీలకంగా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications
