చంద్రబాబుపై జగన్ కు ఎంత గురి అంటే ? మరోసారి బయటపడిందిలా..
పీలో గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు విషయంలో జగన్ పదే పదే ప్రస్తావించే ఓ అంశం ఆయన ఎన్నికల హామీలు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చే హామీల్ని నిలబెట్టుకోలేదని జగన్ తరచూ చెప్తుంటారు. అదే తనకు వరంగా మారుతుందని జగన్ భావిస్తుంటారు కూడా. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సైతం చంద్రబాబు హామీల్ని జనం నమ్మరనే వీర విశ్వాసంతో ఉన్న జగన్ కు జనం గట్టి ఎదురుదెబ్బ కొట్టారు. దీంతో ఈ సెంటిమెంట్ విషయంలో జగన్ పునరాలోచనలో పడతారని అంతా భావించారు. కానీ అలా జరగడం లేదు.
చంద్రబాబు ఎన్నికల కోసం వందల హామీలు ఇస్తారని, కానీ గెలిచాక వాటిని నిలబెట్టుకోరంటూ జగన్ విమర్శలు గుప్పిస్తుంటారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ ప్రచారంలో భాగంగా చంద్రబాబు అంతకు ముందు 2014 ఎన్నికల్లో ఇచ్చిన 600 హామీల్ని ప్రస్తావిస్తూ వాటిని ఎలా విస్మరించారో జనంలోకి తీసుకెళ్లి సక్సెస్ అయ్యారు. దాన్నే మరోసారి తాజా ఎన్నికల్లో రిపీట్ చేసేందుకు ప్రయత్నించారు. అప్పటి చంద్రబాబు మ్యానిఫెస్టోను ఇప్పుడు జనంలోకి తీసుకెళ్లి చంద్రబాబు తీరును ఎండగట్టేందుకు విఫలయత్నం చేశారు.

అయితే జనం ఈసారి చంద్రబాబు విషయంలో జగన్ చెప్పిన ఏ మాటా నమ్మలేదు. దీంతో జగన్ రూటు మారుస్తారని అంతా అనుకుంటున్న తరుణంలో ఇవాళ మరోసారి తాను మారలేదని జగన్ తేల్చిచెప్పేశారు. తాజా ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ అభ్యర్ధులతో ఇవాళ భేటీ అయిన జగన్ 2029 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రాబోతున్నామని చెప్పేశారు. అంతే కాదు చంద్రబాబు ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోరని, అదే తమకు వరంగా మారబోతోందని కూడా చెప్పారు. తద్వారా చంద్రబాబు హామీలపై తనకున్న గురిని మరోసారి జగన్ బయటపెట్టుకున్నారు. మరి ఇప్పటివరకూ తాను ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుపై దృష్టిపెట్టని చంద్రబాబు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications