వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంగ‌ళ‌గిరిపై దృష్టిసారించిన సీఎం జ‌గ‌న్‌.. అంత‌ర్గ‌త స‌ర్వే!

|
Google Oneindia TeluguNews

ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ అన్ని పార్టీల్లోను రాజ‌కీయాలు వేడెక్కాయి. ముంద‌స్తు ఉండొచ్చు అనే భావ‌న‌తో ప్ర‌తిప‌క్షాలు కూడా అన్నివిధాలుగా స‌మాయ‌త్త‌మ‌వుతున్నాయి. అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టికే త‌మ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌ల‌తోపాటు వివిధ ఏజెన్సీల‌ద్వారా, కొన్ని మీడియా సంస్థ‌ల ద్వారా స‌ర్వేలు చేయించి నివేదిక‌లు తెప్పించుకుంటోంది. వీట‌న్నింటినీ క్రోడీక‌రించి అధిష్టానం ఒక నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రధానంగా మంగళగిరి నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో దృష్టిసారించారని తెలుస్తోంది.

 నియోజకవర్గం కలియదిరుగుతున్న లోకేష్

నియోజకవర్గం కలియదిరుగుతున్న లోకేష్


మంగళగిరి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఈసారి కూడా పోటీచేయాల‌నే యోచ‌న‌తో ఉన్నారు. అయితే గ‌త ఎన్నిక‌ల్లో ఆళ్ల చేతిలో ఓట‌మి పాలైన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ తాను ఇక్క‌డినుంచే పోటీచేస్తానని, కచ్చితంగా విజ‌యం సాధిస్తానని ప్రకటించారు. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని అన్ని మండ‌లాలు, గ్రామాల్లో క‌లియ‌తిరుగుతున్నారు. మంగ‌ళ‌గిరి ప‌ట్ట‌ణంలో అన్న‌క్యాంటిన్ ను త‌మ సొంత ఖ‌ర్చుతో టీడీపీ పున‌రుద్ధ‌రించింది. ఈ పరిణామాలన్నింటినీ పరిశీలించిన వైసీపీ అధిష్టానం మంగ‌ళ‌గిరిపై దృష్టిపెట్టింది.

 రాజధాని పరిధిలో రెండూ కీలకమే..

రాజధాని పరిధిలో రెండూ కీలకమే..


రాజ‌ధాని ప‌రిధిలో తాడికొండ‌తోపాటు ఉన్న నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో వైసీపీ అధిష్టానం మంగళగిరిని ప్రత్యేకంగా చూస్తోంది. ఎట్టి ప‌రిస్థితుల్లోను తాము అనుకుంటున్న మూడు రాజ‌ధానుల‌కు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఉంద‌ని తెలియ‌జేయాలంటే అమ‌రావ‌తి ప‌రిధిలోని తాడికొండ‌, మంగ‌ళ‌గిరిని గెలుచుకోవడం ముఖ్యమని భావిస్తోంది. 2019 ఎన్నిక‌ల్లో ఇవి రెండూ వైసీపీ ప‌ర‌మ‌య్యాయి. ఈసారి కూడా మంగ‌ళ‌గిరిలో లోకేష్ ను ఓటమిపాలు చేయడానికి వ్యూహరచన చేస్తోంది.

3ఎమ్మెల్యేపై అంతర్గత సర్వే..

3ఎమ్మెల్యేపై అంతర్గత సర్వే..


నియోజకవర్గం మొత్తం లోకేష్ విస్త్రతంగా పర్యటిస్తుండటంతోపాటు గెలుస్తానని నమ్మ‌కంగా కనపడుతుండటంతో తమ పార్టీవైపు నుంచి ఏమైనా లోపాలున్నాయా? అనే కోణంలో స‌ర్వే జ‌రిగిన‌ట్లు స‌మాచారం. ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందా? అలాగే ఆళ్ల వరుసగా రెండుసార్లు ఇక్కడి నుంచి విజయం సాధించడంతో ఆయనపై ఏమైనా వ్యతిరేకత ఉందా? ఎమ్మెల్యేను మార్చి కొత్త అభ్యర్థిని నిలబెడితే విజయావకాశాలు ఎలా ఉంటాయి? టీడీపీ పునరుద్ధరించిన అన్న క్యాంటిన్ కు స్పందన ఎలా ఉంది? తదితర కోణంలో పూర్తి సమగ్రంగా సర్వే జరిగిందని, వివరాలన్నింటినీ తెప్పించుకున్న ముఖ్యమంత్రి జగన్ వాటిని పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

English summary
It seems that Chief Minister Jagan has mainly focused on the Mangalagiri constituency
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X