వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ జగన్ ను తల లేని కోడితో పోల్చిన నారా లోకేష్

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Assembly Elections 2019 : వైఎస్ జగన్ ను తల లేని కోడితో పోల్చిన నారా లోకేష్ || Oneindia Telugu

అమరావతి: పోలింగ్ ముగిసింది. ఎన్నికల వేడి కాస్త తగ్గుముఖం పట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈవీఎంల పనితీరుపై సందేహాలు లేవనెత్తుతూ దేశ రాజధానిలో హల్ చల్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఈవీఎంల పనితీరుపై ఫిర్యాదులు చేశారు. జాతీయ స్థాయిలో అన్ని ప్రతిపక్ష పార్టీలనూ ఏకం చేసే పనిలో పడ్డారు.

జ‌గ‌న్ కు దేవినేని ఉమా స‌వాల్‌: ద‌మ్ముంటే ఆ పేర్లు బ‌య‌ట పెట్టండి: జ‌గ‌న్ ఓట‌మి అంగీక‌రించారు..!జ‌గ‌న్ కు దేవినేని ఉమా స‌వాల్‌: ద‌మ్ముంటే ఆ పేర్లు బ‌య‌ట పెట్టండి: జ‌గ‌న్ ఓట‌మి అంగీక‌రించారు..!

మరోవైపు- పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసాత్మక సంఘటనలపై వైఎసఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశంపై విమర్శలు చేశారు. ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దృష్టికీ తీసుకెళ్లారు. వారిద్దరి పరిస్థితి అలావుంటే- పోలింగ్ రోజు రాత్రి ధర్నా చేసిన తరువాత తెరమరుగై పోయిన చంద్రబాబు కుమారుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ ఉన్నట్టుండి వార్తల్లోకి ఎక్కారు. ట్విట్టర్ వేదికగా వైఎస్ జగన్ పై ఘాటు విమర్శలు చేశారు. జగన్ ను తల లేని కోడితో పోల్చారు.

YS Jagan is a Head less rooster, says Nara Lokesh

కోడికి తలకాయ లేకపోయినప్పటికీ.. కొన్ని నెలల పాటు బతికేస్తుందని కొద్దిరోజుల కిందట తాను పేపర్ లో చదివానని, వైఎస్ జగన్ కూడా అలాంటి వాడేనని విమర్శించారు. తల లేని కోడిలాగే జగన్ లాంటి వ్యక్తి ప్రతిపక్ష నేతగా అయిదేళ్ల పాటు నెట్టుకొచ్చాడని అన్నారు. జగన్ తో పోలిస్తే.. తల లేని కోడి సంగతి పెద్ద విచిత్రం కాదని అన్నారు. నారా లోకేష్ చేసిన ఈ కామెంట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు పెద్ద ఎత్తన ట్రోల్ చేస్తున్నారు. తమదైన శైలిలో లోకేష్ కు చురకలు అంటిస్తున్నారు.

English summary
Chief Miniter of Andhra Pradesh Chandrababu Naidu Son, IT Miniser Nara Lokesh is strongly criticized on YSR Congress Party President YS Jagan on Wednesday. YS Jagan lika a Headless Rooster, He tweeted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X