ఫాదర్స్ డే: తన తండ్రి వైయస్‌పై జగన్ స్పందన ఇది
హైదరాబాద్: తండ్రుల దినోత్సవం సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి 'హ్యాపీ ఫాదర్స్ డే' అంటూ ట్విట్టర్ ద్వారా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఫాదర్స్ డే సందర్భంగా ఆదివారం ట్విట్టర్ వేదికగా తన భావాలను పంచుకున్నారు వైయస్ జగన్. ఈ సందర్భంగా తండ్రి తన కుమారుడిని పెంచే విషయంలో ఎంతటి బలమైన ముద్రను వేస్తారో ఆయన ఒక ట్వీట్‌తో చెప్పేశారు.
My father was always a voice of certainty in all walks of my life. The greatest gift he gave me, was his belief in me. #HappyFathersDay
— YS Jagan Mohan Reddy (@ysjagan) 19 June 2016
'నా జీవితంలోని ప్రతి ప్రయాణంలో ఎల్లప్పుడు మా నాన్నే నిజమైన గొంతుక. ఆయన నాకు గొప్ప బహుమానం ఇచ్చారు. ఆయన నమ్మకం నాలోనే ఉంది' అంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications