ఫలితాలపై జగన్ స్పందన, ఉద్వేగం - ఆ ఓట్లు ఏమయ్యాయి, దేనికైనా సిద్దం..!!
ఎన్నికల ఫలితాల పై జగన్ తొలి సారి స్పందించారు. తాను చేసిన మంచిని వివరించారు. ఫలితాలు చూస్తే ఆశ్చర్యకరంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఫలితాలు ఇలా వస్తాయని ఊహించలేదన్నారు. ప్రతీ ఇంటికి వివక్ష లేకుండా..అవినీతి లేకుండా 2.70 లక్షల కోట్లు అందించామని గుర్తు చేసారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటికే సేవలు అందించామని చెప్పారు. ఇంతగా ఆలోచించిన మార్పులు తీసుకొస్తే ఆ ప్రేమ..అభిమానం ఏమందోనని జగన్ ఆవేదన వ్యక్తం చేసారు.
ఏదో జరిగింది
జగన్ ఎన్నికల ఫలితాల పైన స్పందిస్తూ తాను ఎంతగా అందరికి మంచి జరిగిన తరువాత ఆ అభిమానం..ఆ ఆప్యాయత ఏమైందో తెలియదని పేర్కొన్నారు. ఎవరో మోసం చేసారు...అన్యాయం చేసారో అనచ్చు కానీ, ఆధారం లేదన్నారు. ఏం జరిగిందో దేవుడికి తెలుసన్నారు. మంచి చేయటానికి మాత్రం ప్రజలకు మంచి వాయిస్ గా ఉంటామని చెప్పారు. పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ముందు నిలుస్తామని హామీ ఇచ్చారు. పేదవాడికి అండగా నిలుస్తామని ప్రకటించారు. కూటమిలో ఉన్న చంద్రబాబు,బీజేపీ, పవన్ కు అభినందనలు తెలిపారు.

కష్టాలు కొత్త కాదు
ఓడిపోయినా కూడా ప్రతీ కష్టంలో అండగా నిలిచిన ప్రతీ కార్యకర్త, వాలంటీర్ కు జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. అమ్మఒడి అందుకున్న53 లక్షల మందికి మంచి చేసాను..వారి పిల్లల కోసం తాపత్రయ పడుతూ అడుగులు వేసామని వివరించారు. 66 లక్షల మంది అవ్వా తాతాలకు,వితంతువులు, వికలాంగులకు గతంలో ఎన్నడూ లేనివిధంగా మంచి చేసాం, వారికి తోడుగా నిలిచామని చెప్పారు. ఏం చేసినా 40 శాతం ఓట్ బ్యాంక్ తగ్గించలేకపోయారన్నారు. ప్రతిపక్షంలో పోరాటాలు కొత్త కాదని చెప్పారు. పోరాటాలే చేసామని గుర్తు చేసారు. రాజకీయ పోరాటంలో చూడకూడని కష్టాలే చూసాము. ఎలాంటి కష్టాలైనా ఎదుర్కోవటానికి సిద్దంగా ఉంటామని జగన్ స్పష్టం చేసారు.
ఆ ప్రేమ ఏమైందో
అర కోటి మంది రైతుల ప్రేమ ఏమైందో తెలియదని వ్యాఖ్యానించారు. నేతన్న నేస్తం, వాహనమిత్ర, మత్స్యకార భరోసా వంటి ఎన్నో పథకాల ద్వారా మంచి చేసామని వివరించారు. ఇన్ని కోట్ల మందికి మంచి చేసి..ఎప్పుడూ లేని విధంగా మేనిఫెస్టో అమలు చేసినా ఆ ప్రేమ ఏమైందోనని ఆవేదన వ్యక్తం చేసారు. తనకు పోరాటాలు కొత్త కాదని..పోరాటానికి ఎప్పడూ సిద్దమేనని జగన్ స్పష్టం చేసారు. కొత్త ప్రభుత్వం కు ఆల్ ది బెస్ట్ చెప్పిన జగన్..తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. ప్రతిపక్ష పాత్రలో పేదవాడి కోసం నిలబడతామని జగన్ స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications