అమ్మ తప్పు లేదు, షర్మిల అత్యాశతోనే - జగన్ సంచలనం..!!
మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక అంశాలను వెల్లడించారు. తన తల్లి, సోదరి షర్మిల తో ఆస్తుల వివాదం పైన అనేక విషయాలను బయట పెట్టారు. షర్మిల అత్యాశతోనే సమస్యలు వస్తున్నాయని వివరించారు. కోర్టు కేసుల దృష్ట్యా వాటాలు అమ్మ పేరిట ఉంచితే, గిప్ట్‌డీడ్‌లను అడ్డుపెట్టుకుని షర్మిల కాజేయాలని చూస్తోందని జగన్ ఆరోపించారు. షర్మిల పై ఒక సమయంలో ఉన్న ప్రేమ .. ఆప్యాయత ఇప్పుడు లేవని జగన్ చెప్పుకొచ్చారు.
షర్మిల తీరే కారణం
సరస్వతి పవర్ వాటాల బదలాయింపు వ్యవహారంలో జగన్ ఎన్సీఎల్టీలో పిటీషన్ దాఖలు చేసారు. ఇందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. వాటాల విషయంలో తల్లి విజయమ్మను ముందు ఉంచి షర్మిల వెనుక వ్యవహారం మొత్తం నడిపిస్తున్నారని చెప్పుకొచ్చారు. తల్లి విజయమ్మను ముందు పెట్టుకుని తన పంతం నెగ్గించుకోవడానికి చెల్లి షర్మిల అక్రమ చర్యలకు పాల్పడుతున్నా రని ఆరోపించారు. వాటాల వివాదంలో తల్లి విజయమ్మ ఆవేదనను అర్థం చేసుకోగలమని జగన్ పేర్కొన్నారు. తన తల్లి పైనా గౌరవం ఉందన్న జగన్, కానీ ఆమె వెనక ఉండి చెల్లి చేయిస్తున్న అక్రమాలను అడ్డుకోవడానికే పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు.

అమ్మతో ప్రయత్నించా
షర్మిల తన వ్యక్తిగత, రాజకీయ విభేదాలతో తల్లి, ఇతరులను అడ్డుపెట్టుకుని వాటాలు బదలా యించడం వల్ల తమకు నష్టం వాటిల్లిందని జగన్ వివరించారు. హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున చెల్లితో పరిస్థితులు చేయి దాటిపోకుండా తనతో పాటుగా, భారతీ అమ్మ ద్వారా ప్రయ త్నాలు చేసామని.. కానీ, అవి ఫలించలేదని చెప్పుకొచ్చారు. షర్మిల ఏ కంపెనీలోనూ పెట్టుబడి పెట్టలేదని, నిర్వహణలో భాగస్వామి కాలేదని వివరించారు. కంపెనీలపై నమోదైన కేసులనూ ఆమె ఎదుర్కోలేదన్న జగన్, అయినా తల్లిని బలిపశువును చేసి, మా వాటాలు లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కంపెనీ చట్టంలోని సెక్షన్-59 కింద రిజిస్టర్‌లో పేర్లను మార్చినపుడు, సరైన కారణముంటే జోక్యం చేసుకునే పరిధి ట్రైబ్యునల్‌కు ఉంటుందని పిటీషన్ లో స్పష్టం చేసారు.
తప్పుడు పత్రాలతో
పథకం ప్రకారమే షర్మిల ఈ పిటిషన్ నుంచి తప్పించాలని కోరుతున్నారని జగన్ అన్నారు. చెల్లి ఒత్తిడితోనే గిఫ్ట్‌డీడ్‌లను అడ్డుపెట్టుకుని వాటాల అక్రమ బదలాయింపును తల్లి సమర్థించుకుంటు న్నారని జగన్ పేర్కొన్నారు. గిఫ్ట్‌డీడ్ ప్రక్రియ పూర్తికాలేదని, వాటాల సర్టిఫికెట్లను తామింకా తర తల్లి విజయమ్మ కు అందజేయలేదని చెప్పారు. వాటాలు బదలాయించనేలేదని స్పష్టం చేసారు. చెల్లితో ఉన్న వ్యక్తిగత, రాజకీయ విభేదాలతో ఈ పిటిషన్ వేశామనడం అవాస్తవమని జగన్ పేర్కొ న్నారు. గతంలో షర్మిలపై ఉన్న ప్రేమ, ఆప్యా యతలు తాను చేసిన మోసం, అక్రమ చర్యల వల్ల ఇప్పుడు లేవని చెప్పారు. పాత తేదీలతో సృష్టించిన పత్రాలతో, తప్పుడు అఫిడవిట్లతో తన ఆస్తిని లాక్కునేందుకు షర్మిల ప్రయత్ని స్తున్నారని జగన్ ఆరోపించారు.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications