అభ్యర్దుల ఖరారు వేళ జగన్ కొత్త ఎత్తుగడ - గ్రౌండ్ రిపోర్ట్ తో మారిన లెక్కలు..!!
ఏపీలో స్థానిక ఎన్నికల వేళ రాజకీయం ఆసక్తిగా మారుతోంది. కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికలు కూటమి- వైసీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. కొత్త వ్యూహాలు తెర మీదకు వస్తున్నాయి. కూటమి లో పార్టీలు పోటీ చేసే స్థానాలు ఫిక్స్ అయ్యాయి. వైసీపీ నుంచి అభ్యర్ధులను ప్రకటించారు. కాగా.. మాజీ సీఎం జగన్ స్థానిక ఎన్నికల వేళ కొత్త ఎత్తుగడలను అమలు చేస్తున్నారు. గ్రౌండ్ రిపోర్ట్స్ కు అనుగుణంగా తన వ్యూహాలను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా పార్టీ నేతలకు తాజాగా కీలక దిశా నిర్దేశం చేసారు.
స్థానిక ఎన్నికల వేళ మాజీ సీఎం జగన్ నిర్ణయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఇప్పటి తొలి విడత అభ్యర్ధుల జాబితాను ప్రకటించారు. మిగిలిన స్థానాల్లో అభ్యర్ధుల పైన తుది కసరత్తు జరుగుతోంది. జగన్ తన పార్టీ అభ్యర్ధుల విషయంలో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చారు. కూటమి పార్టీలు పోటీ చేసే స్థానాలు ఖరారు కావటంతో అభ్యర్ధుల ఎంపికలో రూటు మార్చారు. వైసీపీలో స్థానిక సంస్థల్లో మేయర్లు, ఛైర్మన్లుగా ఉంటూ కూటమి ప్రభుత్వం రాగానే పదవులు కోల్పోయిన వారికి తిరిగి అవకాశం కల్పిస్తున్నారు. కూటమి నుంచి ఎంపిక చేస్తున్న అభ్యర్ధుల సామాజిక వర్గాల ఆధారంగా తమ పార్టీ అభ్యర్ధులను ప్రకటిస్తున్నారు. ఇదే సమయంలో జగన్ పార్టీ ముఖ్య నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీ లక్ష్యంగా ఏంటో తేల్చి చెప్పారు.

పార్టీ నేతలకు కీలక దిశా నిర్దేశం
కూటమి అధికారంలో ఉండటంతో ఈ ఎన్నికల్లో అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను సద్వి నియోగం చేసుకొని గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తుందని జగన్ పార్టీ నేతలకు చెబుతున్నారు. ఇదే సమయంలో కూటమిలో సీట్ల సర్దుబాటులో భాగంగా సీటు దక్కని వారిలో ఉన్న అభిప్రాయాల ను అనుకూలంగా మలచుకోవాలని నిర్దేశించారు. సీమలో కార్పోరేషన్లు, మున్సిపాల్టీల పైన స్పెషల్ ఫోకస్ పెట్టారు. మూడు జిల్లాల్లో మాత్రం సమిష్టిగా కష్టపడితే సానుకూల ఫలితాలు ఖాయ మని జగన్ స్పష్టం చేసారు. అదే విధంగా ఫలితం ఎలా ఉన్నా... పార్టీ ఓటింగ్ శాతం మాత్రం తగ్గకుండా చూసుకోవాలని సూచించారు. పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లు ఎన్నికలు పూర్తయ్యే వరకూ అభ్యర్ధులకు అందుబాటులో ఉండాలని తేల్చి చెప్పారు. ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయనే స్థానాల్లో ముఖ్య నేతలకు బాధ్యతలు కేటాయించారు. దీంతో... స్థానిక ఎన్నికల వేళ చోటు చేసుకునే రాజకీయం.. ఫలితం పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications
