జగన్ ఆస్తుల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..! 3 వారాల డెడ్ లైన్..!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) అక్రమాస్తుల కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మధ్య జగన్ కేసుల్లో దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచాయి. మరోవైపు ఈ కేసుల్ని త్వరగా తేల్చాలంటూ తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ తెలంగాణ హైకోర్టు ఈ కేసుల వ్యవహారంలో కీలక ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ కేసులు ఏ మలుపు తీసుకుంటాయో అన్న టెన్షన్ పెరుగుతోంది.

బొత్స అనూషపై సోషల్ మీడియా ట్రోలింగ్స్- హైకోర్టు కీలక ఆదేశాలు..!
బొత్స అనూషపై సోషల్ మీడియా ట్రోలింగ్స్- హైకోర్టు కీలక ఆదేశాలు..!

గతంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జగన్ అక్రమాస్తులు సంపాదించారంటూ దాఖలైన పలు కేసులు ఒక్కొక్కటిగా ఛార్జిషీట్ దశకు చేరుకుంటున్నాయి. అయితే సీబీఐ, ఈడీ ఈ కేసుల్లో దర్యాప్తు ఆలస్యం చేస్తున్నాయంటూ, వాటిని వేగంగా దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్లు వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ గతంలో తెలంగాణ హైకోర్టులో హరిరామజోగయ్య పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ తాజాగా మరోసారి తెలంగాణ హైకోర్టులో విచారణకు వచ్చింది. దీనిపై స్పందించిన హైకోర్టు.. దీని స్టేటస్ ఏంటని దర్యాప్తు సంస్థల్ని ప్రశ్నించింది. దీంతో ఈ కేసుల స్టేటస్ వివరాలు చెప్పేందుకు తమకు మూడు వారాల గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాదులు హైకోర్టును కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. వారికి మూడు వారాల గడువు ఇస్తూ.. అప్పటిలోగా ఈ కేసుల స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.

YS Jagan s Disproportionate Assets Cases Telangana High Court Seeks Status Report
విజయ్ ప్రభుత్వంలో ఏపీ గూఢచారులు? 15 మందిపై వేటు.! అందులో ముగ్గురు..!
విజయ్ ప్రభుత్వంలో ఏపీ గూఢచారులు? 15 మందిపై వేటు.! అందులో ముగ్గురు..!

జగన్ అక్రమాస్తుల కేసులో ఇప్పటివరకూ సీబీఐ 11, ఈడీ 11 ఛార్జిషీట్లు దాఖలు చేశాయి. వీటిపై విచారణ 15 ఏళ్లుగా కొనసాగుతోందని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తెచ్చారు. అలాగే ఇదే కేసుల్లో 150కి పైగా డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలైన విషయాన్ని కూడా కోర్టుకు తెలిపారు. అయితే డిశ్చార్జ్ పిటిషన్ పై హైదరాబాద్ సీబీఐ కోర్టు విచారణ జరుపుతున్న విషయాన్ని ఈడీ లాయర్లు హైకోర్టుకు వెల్లడించారు. వీటి పెండింగ్ కారణంగా ఛార్జిషీట్లపై విచారణ ముందుకు సాగడం లేదన్నారు. దీంతో కేసుల్ని రోజువారీ విచారణ చేపట్టాలని కోరారు. అలాగే నిందితులు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని కూడా ఈడీ లాయర్లు కోరారు. దీనిపై స్టేటస్ రిపోర్ట్ వచ్చాక హైకోర్టు తదుపరి నిర్ణయం తీసుకోనుంది. ఆ లోపు ఈ నెల 30కి తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+