ఎలా గెలుస్తావో చూస్తా, ఇంకా నయం బాబు ఇంగ్లీష్ సినిమాలు చూడట్లేదు: జగన్ నోట సెక్స్ రాకెట్

Posted By:
Subscribe to Oneindia Telugu

ఇడుపులపాయ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించారు. పాదయాత్ర ప్రారంభం సమయంలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

  YS Jagan Padayatra : కిక్కిరిసిపోయిన ఇడుపులపాయ | Oneinda Telugu

  చంద్రబాబు దుమ్ముదులిపిన వైయస్ జగన్

  చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో ఆడియోతో సహా అడ్డంగా దొరికిపోయాడని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో ఎవరూ సంతోషంగా లేరు కాబట్టి తాను పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు. రాజధాని కోసం రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని ఆరోపించారు. నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు రాజధాని కోసం ఒక్క ఇటుక కూడా పెట్టలేదన్నారు.

  జగన్‌కు బిగ్ షాక్: నల్లధన ప్రముఖుల జాబితాలో జగన్ పేరు

  బాబు విడుదలయ్యే 4 సినిమాలు చూస్తారు, ఇంకా నయం

  బాబు విడుదలయ్యే 4 సినిమాలు చూస్తారు, ఇంకా నయం

  విడుదలయ్యే నాలుగు సినిమాలు చంద్రబాబు చూస్తారని, ఏ సినిమా బాగుంటే ఆ సినిమాలోని భవనాలను రాజధాని అంటారని జగన్ ఎద్దేవా చేశారు. సింగపూర్ వెళ్తే సింగపూర్ లాంటి, జపాన్ వెళ్తే జపాన్ వంటి రాజధాని అంటారన్నారు. ఇంకా నయం ఆయన ఇంగ్లీష్ సినిమాలు చూడటం లేదన్నారు.

  బాబుకు నేను సవాల్ విసురుతున్నా

  బాబుకు నేను సవాల్ విసురుతున్నా

  నంద్యాలలో గెలుపును చంద్రబాబు తమ గెలుపుగా చెప్పుకుంటున్నారని జగన్ ఎద్దేవా చేశారు. కానీ తాను బాబుకు తాను ఓ సవాల్ విసురుతున్నానని, నీ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని నీవు అనుకుంటే తమ పార్టీ నుంచి మీ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఒకేసారి ఉప ఎన్నికలు వచ్చేలా చేయాలన్నారు.

  రూ.4000 కోట్లు ఖర్చు చేసి ఎలా గెలుస్తారో చూస్తా

  రూ.4000 కోట్లు ఖర్చు చేసి ఎలా గెలుస్తారో చూస్తా

  రూ.200 కోట్లు ఖర్చు చేసి నంద్యాలలో గెలిచారన్నారు. ఒకేసారి ఇరవై స్థానాల్లో ఎన్నికలు అంటే చంద్రబాబుకు రూ.4000 కోట్ల నల్లధనం కావాలన్నారు. అంత ఖర్చు పెట్టి ఎలా గెలుస్తారో చూస్తానని ప్రశ్నించారు.

  చంద్రబాబుపై నిన్నటి చీఫ్ సెక్రటరీ విమర్శలు

  చంద్రబాబుపై నిన్నటి చీఫ్ సెక్రటరీ విమర్శలు

  నిన్నటి దాకా చంద్రబాబు హయాంలో చీఫ్ సెక్రటరిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఆయన పాలనలోని రోజుకో స్కాంను బయటకు చెబుతున్నారని జగన్ అన్నారు. బాబు హయాంలో సర్పంచ్‌లకు, జెడ్పీటీసీలకు అధికారాలు లేవని, ఓ దొంగల ముఠాకు అధికారాలు ఉన్నాయన్నారు. ఈ దొంగల ముఠాను చూస్తుంటే బాలగంగాధర్ చెప్పిన సామెత గుర్తుకు వస్తోందని, గజానికి ఒక్క గాంధారి కొడుకు అని ఆయన చెప్పారని గుర్తు చేశారు. జన్మభూమి కమిటీల్లో అంతా టీడీపీ వారే అన్నారు.

  సెక్స్ రాకెట్ నడుపుతున్నారు

  సెక్స్ రాకెట్ నడుపుతున్నారు

  రిషికేశ్వరి వంటి అమ్మాయిలు చనిపోతే పట్టించుకోరా అని జగన్ ధ్వజమెత్తారు. విజయవాడలో సెక్స్ రాకెట్ నడుస్తోందని, కానీ చర్యలు లేవని మండిపడ్డారు. బాబు పాలనలో ఉద్యోగస్తులు కూడా సంతోషంగా లేరన్నారు. మేం అధికారంలోకి రాగానే ప్రతి ఉద్యోగికి ఇంటిస్థలం ఇస్తామన్నారు. నేను అందరు మెచ్చే మేనిఫెస్టో తీసుకు వచ్చి, వైయస్ ఎంత గొప్పవాడో, జగన్ కూడా అంతే గొప్పవాడు అని మీ చేత (ప్రజలు) అనిపించుకుంటానని చెప్పారు.

  నాకు ఉన్న కసి ఇదే

  నాకు ఉన్న కసి ఇదే

  చంద్రబాబులా తాను కేసులకు భయపడనని జగన్ చెప్పారు. తనకు కసి ఉన్నదని చెప్పారు. చనిపోయాక కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బతకాలని నాకు ఉందని, వారి గుండెల్లో ఉండాలని ఉందని, ఆ కసి ఉందన్నారు. అందుకే మంచి చేస్తానన్నారు. ప్రత్యేక హోదాను సంజీవినిగా భావిస్తున్నానని, దానిని సాధించాలనే కసి ఉందన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేయాలనే కసి ఉందన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  YSR Congress party chief YS Jaganmohan Reddy fired at Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu before starting Padayatra.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి