Ys Jagan: బంగారు పాళ్యంలో జగన్..! కాన్వాయ్ దిగకుండా అడ్డుకున్న ఎస్పీ..!
ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎట్టకేలకు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనకు వచ్చారు. కొద్దిసేపటి క్రితం బంగారుపాళ్యం చేరుకున్న జగన్ కు భారీ స్దాయిలో వైసీపీ కార్యకర్తలు, రైతులు, జనం స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మార్కెట్ యార్డ్ కు వెళ్లే రోడ్లన్నింటినీ పోలీసులు బ్యారికేడ్లు పెట్టి బ్లాక్ చేశారు. రాయలసీమలోని మూడు జిల్లాల్లో తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో జగన్ వారిని పరామర్శించేందుకు వచ్చారు.
ఇవాళ ఉదయం పులివెందుల నుంచి బెంగళూరు మీదుగా చిత్తూరు జిల్లా బంగారుపాళ్యానికి చేరుకున్న జగన్ ను చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. పోలీసులు భారీ స్ధాయిలో ఆంక్షలు విధించి వారిని అడ్డుకున్నారు. ముఖ్యంగా బంగారు పాళ్యం మార్కెట్ యార్డ్ కు వెళ్లే దారులన్నీ బ్యారికేడ్లతో మూసేసారు. జగన్ పర్యటనకు వెళ్లే వాహనాలను, జనాన్ని లెక్కించి మరీ మార్కెట్ యార్డ్ వద్దకు పంపుతున్నారు. ఈ నేపథ్యంలో బంగారుపాళ్యం చేరుకున్న జగన్ ను చూసేందుకు వారు ఆంక్షల్ని లెక్కచేయకుండా ముందుకు దూసుకెళ్లారు.

ఈ సందర్భంగా గాయపడిన పార్టీ కార్యకర్తను కలవడానికి తన కాన్వాయ్ నుండి బయటకు వెళ్లడానికి ప్రయత్నించిన జగన్ ను బంగారుపాలెం సమీపంలో పోలీసు అధికారులు అడ్డుకున్నారు.వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పోలీసులు దాడి చేశారని తెలుసుకున్న వైఎస్ జగన్ .. తన వాహనం నుండి దిగడానికి ప్రయత్నించారు.

ఘర్షణలో గాయపడిన ఒక కార్యకర్తను స్వయంగా కలుసుకుని ఓదార్చాలని భావించారు. అయితే జిల్లా ఎస్పీ జోక్యం చేసుకుని వైఎస్ జగన్ కాన్వాయ్ నుండి బయటకు రాకుండా అడ్డుకున్నారు.వైఎస్ జగన్ పట్టుబట్టినా .. ఎస్పీ గాయపడిన కార్యకర్తను కలవడానికి అనుమతించలేదు. చివరికి ఆయన కాన్వాయ్‌లోకి తిరిగి ప్రవేశించి తన ప్రయాణాన్ని కొనసాగించాల్సి వచ్చింది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications