పాదయాత్రకు రక్షణ కల్పించాలి: డీజీపీకి జగన్‌ లేఖ

Posted By:
Subscribe to Oneindia Telugu
పాదయాత్రకు రక్షణ కల్పించాలి : జగన్ యాత్రపై బాబు కుట్రలు | Oneindia Telugu

అమరావతి: ఈ నెల 6వ, తేది నుండి నిర్వహించనున్న పాదయాత్రకు భద్రత కల్పించాలని ఏపీ డీజీపికి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ లేఖ రాశారు. ఈ నెల 6వ, తేది నుండి ఇడుపులపాయ నుండి జగన్ పాదయాత్రను ప్రారంభించనున్నారు.

పాదయాత్రకు సంబంధించి తగిన భద్రతను కల్పించాలని వైఎస్ జగన్ ఏపీ డీజీపీకి గురువారం నాడు లేఖ రాశారు.ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర జరుగుతుందని ఆ లేఖలో జగన్ చెప్పారు.

Ys Jagan writes letter to AP DGP protection for padayatra

జిల్లాల వారీగా పోలీసులకు రూట్ మ్యాప్ అందజేస్తామని ఆ లేఖలో జగన్ పేర్కొన్నారు. ఏడు నెలల పాటు జరిగే పాదయాత్రకు తగిన భద్రత కల్పించాలని ఈ సందర్భంగా డీజీపీకు విజ్ఞప్తి చేశారు.

మరో వైపు పాదయాత్రకు ఎలాంటి ఇబ్బందులు కల్గించకుండా భద్రతను కల్పించాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడ మీడియా సమావేశంలో పోలీసులను కోరారు.ఈ మేరకు పోలీసులు సహకరించాలన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ysrcp chief Ys Jagan wrote a letter to Ap DGP Sambasiva rao on Thursday. Jagan requested to DGP provide to protection his padayatra. Jagan will start Padayatra from Nov 6.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి