ఆపరేషన్ పిఠాపురం ! పవన్ ఓటమికి జగన్ బిగ్ ప్లాన్ ఇదే..!

ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ఉత్కంఠ రేపుతున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో పిఠాపురం తొలి స్ధానంలో ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్లు సంకేతాలు రాగానే సీఎం వైఎస్ జగన్ అన్ని అస్త్రాలు సిద్దం చేసుకోవడం మొదలుపెట్టేశారు. తాజాగా పవన్ కళ్యాణ్ తన అభ్యర్ధిత్వాన్ని స్వయంగా ప్రకటించగానే ఆ అస్త్రాల్ని ప్రయోగించడం ప్రారంభించేశారు. గతంలో పవన్ పోటీ చేసిన రెండు సీట్లలో ఓడిపోవడంతో ఈసారి కూడా పిఠాపురంలో ఓడిస్తే హ్యాట్రిక్ రికార్డు వస్తుందని భావిస్తున్నారు.

కాకినాడ జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ సీటులో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించేసిన నేపథ్యంలో ఆయన్ను ఓడించేందుకు జగన్ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఇందులో భాగంగా అందుబాటులో ఉన్న అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ముఖ్యంగా పిఠాపురం అసెంబ్లీ సీటు పరిధిలో మండలాల వారీగా ఇన్ ఛార్జ్ లను నియమించేశారు.
నియోజకవర్గంలోని పిఠాపురం, గొల్లప్రోలు, యూ.కొత్తపల్లి మండలాలకు కీలక నేతల్ని ఇన్ ఛార్జ్ లుగా నియమించారు.

ys jagan s big sketch for defeating pawan kalyan in pithapuram

ఈ మేరకు పిఠాపురంపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టిన ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్‌ మిధున్‌రెడ్డి .. గొల్లప్రోలు మండలానికి ఇన్‌ఛార్జిగా మాజీ మంత్రి కురసాల కన్నబాబును నియమించారు. అలాగే యు.కొత్తపల్లి మండలానికి మంత్రి దాడిశెట్టి రాజాను సమన్వయకర్తగా పంపుతున్నారు. అలాగే పిఠాపురంలో వంగా గీత ఎలాగో ఉంటారు. అదే సమయంలో నియోజకవర్గంలో కాపు నేతల్ని దారికి తెచ్చుకునేందుకు ఈ మధ్యే పార్టీలో చేరిన కీలక నేత ముద్రగడ పద్మనాభాన్ని రంగంలోకి దింపారు.

ఎన్నికల సమయంలో పిఠాపురంలో డబ్బు, పోల్ మేనేజ్ మెంట్, ఇతర వ్యూహాల్ని అమలు చేసేందుకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే
ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిని ఎంపిక చేశారు. ఇప్పటికే వీరంతా రంగంలోకి దిగిపోయారు. గొల్లప్రోలులో కాపు నాయకులతో ముద్రగడ పద్మనాభం తాజాగా రహస్య భేటీ నిర్వహించారు. అలాగే యు.కొత్తపల్లి మత్స్యకార నాయకులతో దాడిశెట్టి రాజా మీటింగ్‌ పెట్టారు. ఈసారి ఎలాగైనా పవన్ కు ఓటు వేయొద్దని వారు కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+