కేంద్రమంత్రి వ్యాఖ్యలపై షర్మిల భగ్గు: విజయవాడలో భారీ ఆందోళన

Ravneet Singh Bittu vs YS Sharmila: రైల్వే శాఖ సహాయమంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తోంది. పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగింది. నిరసన ప్రదర్శనలతో హోరెత్తిస్తోంది. దిష్టిబొమ్మలనూ దగ్ధం చేస్తోంది.

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి రవ్‌నీత్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ దేశంలోనే అతిపెద్ద ఉగ్రవాదిగా అభివర్ణించారు. అమెరికా పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను వేర్పాటువాదులు, విధ్వంసకారులు, విచ్ఛనవాదులు మాత్రమే సమర్థిస్తారని పేర్కొన్నారు.

YS Sharmila and Congress workers stage a protest in Vijayawada against Ravneet Singh Bittu

ఏదో ఒక రోజు ఆయన నాయనమ్మకు పట్టిన గతే రాహుల్‌ గాంధీకీ పడుతుందని రవ్‌నీత్ హెచ్చరించారు. అసలు రాహుల్ గాంధీ భారతీయుడే కాదని అన్నారు. ఆయనకు దేశం మీద ఎలాంటి ప్రేమ లేదని అన్నారు. విదేశాలకు వెళ్లినప్పుడల్లా భారత్‌పై విషం చిమ్ముతుంటాడని చెప్పారు.

ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి ఆందోళనకు పిలుపునిచ్చింది. అన్ని రాష్ట్రాల్లోనూ ధర్నాలను నిర్వహిస్తోంది. దేశ రాజధానిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్ఎస్‌యూఐ ప్రతినిధులు రవ్‌నీత్ సింగ్ బిట్టు ఇంటి వద్ద బైఠాయించారు. ఆందోళన చేపట్టారు.

అదే సమయంలో పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్.. రవ్‌నీత్‌పై ఢిల్లీలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బిట్టుతో పాటు వేర్వేరు సందర్భాల్లో రాహుల్ గాంధీపై ఘాటు పదాలతో విమర్శలు గుప్పించిన మరికొందరు బీజేపీ నాయకుల పేర్లను కూడా చేర్చారు.

YS Sharmila and Congress workers stage a protest in Vijayawada against Ravneet Singh Bittu

దీనికి కొనసాగింపుగా ఏపీలో ప్రదేశ్ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల.. విజయవాడలో ధర్నా చేపట్టారు. పలువురు పీసీసీ నాయకులు ఇందులో పాల్గొన్నారు. రవ్‌నీత్ సింగ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ షర్మిల డిమాండ్ చేశారు. బాధ్యతాయుదమైన కేంద్రమంత్రి పదవిలో ఉంటూ ప్రతిపక్ష నేతపై ఇష్టానుసారంగా మాట్లాడిన బిట్టును వెంటనే మంత్రిపదవి నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేశారు.

రాహుల్‌ గాంధీని చూసి బీజేపీకి భయం పట్టుకుందని షర్మిల విమర్శించారు. బీజేపీని బండారం మొత్తాన్నీ ఆయన లోక్‌సభ సాక్షిగా బట్టబయలు చేస్తున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని కూడా గౌరవించని పార్టీ బీజేపీ అని, అలాంటి వాళ్లకు దేశం కోసం ప్రాణాలను అర్పించిన గాంధీ కుటుంబంపై విమర్శలు చేసే హక్కు లేదని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+