సజ్జల రామకృష్ణారెడ్డికి వైఎస్ షర్మిల కౌంటర్..!!

వైస్సార్టీపీ చీఫ్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్లు తాజాగా షర్మిల ప్రకటించారు. దీని పైన వైసీపీ నేతలు స్పందించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ ఇచ్చారు. అదే విధంగా తన పార్టీ కాంగ్రెస్ లో విలీనం విషయంలో కొందరు నేతలు అడ్డు పడ్డారంటూ పరోక్షంగా రేవంత్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని అనుకున్నామని.. కొంత మంది వాళ్ళ స్వార్థం కోసం పార్టీ విలీనం కాకుండా అడ్డుకున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకౌంటర్ ఇచ్చారు. ఏపీ పరిస్థితి ఎలా ఉందో సీఎం కేసీఆర్ ప్రతీ బహిరంగ సభలో చెప్తున్నారని.. ముందు సజ్జల దీనికి సమాధానం చెప్పాలన్నారు. ఒకప్పుడు తాను పార్టీ పెడితే తెలంగాణాలో షర్మిలకు ఏం సంబంధం అని సజల్జ అన్నారని.. ఇప్పుడు తెలంగాణ ప్రజలతో తనకు సంబంధం ఉందని సజ్జల ఒప్పుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఏపీ పరిస్థితిపై అక్కడి నేతలు ఆలోచిస్తే మంచిది తెలంగాణ గురించి వాళ్లకు అనవసరమన్నారు.

YS Sharmila Counter to YSRCP leader Sajjala over his comments on YSRTP Support for Congress

లెఫ్ట్ పార్టీల దగ్గరకు వెళ్లి మద్దతు అడుగుతున్న కాంగ్రెస్ నేతల్లో కొందరికి పదవి భయం పట్టుకుందని తెలిపారు. తాను కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది నిజమని.. దానికోసం ప్రచారం కూడా చేస్తానని వెల్లడించారు. కొన్ని కారణాల వాళ్ళ కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని అనుకుంటే కొంత మంది అడ్డుకున్నారని పరోక్షంగా రేవంత్ పైన వ్యాఖ్యలు చేసారు. తాను పాలేరు నుంచి పోటీ చేద్దామని భావించినా..కాంగ్రెస్ నుంచి అక్కడ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పోటీలో ఉన్నారని గుర్తు చేసారు. గతంలో ఖమ్మం ఎంపీగా పొంగులేటి గెలుపు కోసం తాను ప్రచారం చేసానని..తనతో పాదయాత్రలోనూ పొంగులేటి పాల్గొన్నారని షర్మిల వివరించారు. అటువంటి పొంగులేటిని ఓడించేందుకు తననున బరిలో దిగమంటారా అని షర్మిల ప్రశ్నించారు.

షర్మిల తెలంగాణలో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వటం పైన వైసీపీ నేత సజ్జల ఆ సమయంలో స్పందించారు. వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ ద్రోహం చేసిందని పేర్కొన్నారు. అటువంటి పార్టీకి షర్మిల మద్దతు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలకు షర్మిల స్పందించారు. కాంగ్రెస్ అభ్యర్దుల కోసం షర్మిల ప్రచారంలో పాల్గొనేలా ఆ పార్టీ నేతలు మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షర్మిల సైతం కాంగ్రెస్ అభ్యర్దుల గెలుపు కోసం వైఎస్సార్టీపీ శ్రేణులు పని చేయాలని పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+