జగన్ గెలవాలంటే ? ఏం చేయాలో చెప్పిన షర్మిల..! పాదయాత్రపై సెటైర్లు..!
ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షురాలిగా ఎంట్రీ ఇచ్చి అనూహ్యంగా తనకు ఆస్తులు ఇవ్వని అన్న వైఎస్ జగన్ ను టార్గెట్ చేయడం ప్రారంభించిన వైఎస్ షర్మిల (ys sharmila).. కూటమి అధికారంలోకి వచ్చాక కూడా అదే తీరు కొనసాగించారు. కానీ కొంతకాలంగా జగన్ విషయంలో ఆరోపణలకు బ్రేక్ ఇచ్చిన వైఎస్ షర్మిల తిరిగి ఇవాళ ఆయన పాదయాత్రను టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగారు. పాదయాత్ర ఇప్పుడు ఎందుకని ప్రశ్నించిన షర్మిల.. అధికారం ఇస్తే ఏం చేశారని నిలదీశారు.
జగన్ పాదయాత్ర ఎందుకు ? అధికారం కోసమే కదా ఈ పాట్లు ? అధికారం ఇస్తే ఏం చేశారు ? వైఎస్సార్ జలయజ్ఞం పూర్తి చేయగలిగారా? నవరత్నాల్లో పెట్టిన హామీలకు దిక్కులేదన్నారు. అధికారంలో వచ్చిన 6 నెలల్లో పూర్తి చేస్తా అన్నారని,
అధికారం ఇస్తే ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. మద్యనిషేధం అన్నారని, అధికారం ఇస్తే కల్తీ మద్యం పెట్టి , క్యాష్ పద్ధతిలో మద్య మాఫియా చేశారన్నారు.

వేల ఏళ్ల నుంచి నిలబడ్డ రుషికొండను బోడి గుండు చేశారని షర్మిల ఆరోపించారు. అధికారం ఇస్తే ఒక్క రోజు కూడా బయటకు రాలేదని, ఆ పార్టీ వాళ్ళకే అందుబాటులో లేదని విమర్శించారు. ఎన్నికలకి 6 నెలల ముందు బయటకు వచ్చి సిద్ధం అంటూ కొన్ని నెలలు తిరిగారన్నారు. అంతే తప్పిస్తే ఒకరోజు అయినా ప్రజల కోసం బయటకు వచ్చారా ? అని ప్రశ్నించారు. ఒక మనిషి నిజమైన నైజం తెలియాలి అంటే అధికారం ఇచ్చి చూడాలన్న అబ్రహం లింకన్ మాటల్ని గుర్తుచేశారు.

జగన్ ని అధికారంలో చూశామని, ఆయనకు అధికారం సూట్ అవ్వలేదని తెలిపారు. జగన్ నేచర్ మారాలని, నైజం మారాలని,మార్పు రావాలని సూచించారు. జగన్ లో స్వార్థం తగ్గి మంచితనం పెరగాలన్నారు. అప్పుడు దేవుడు అధికారం ఇస్తాడేమో అన్నారు. అంతవరకు దేవుడు , ప్రజలు ఆశీర్వదించడన్నారు. ఏడాది న్నర తర్వాత చేసే పాదయాత్రకు ఇప్పుడు అనౌన్స్ ఎందుకని ప్రశ్నించారు. చిత్తశుద్ధి లేని యాత్రలు ఎందుకన్నారు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications