అన్న కనిపించకుండా జాగ్రత్త పడిన షర్మిల..
YS Jagan and YS Sharmila: కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల తనయుడు వైఎస్ రాజా రెడ్డి- ప్రియా అట్లూరి నిశ్చితార్థం గ్రాండ్‌గా ముగిసింది. గురువారం రాత్రి హైదరాబాద్ గండిపేట్‌లోని గోల్కొండ రిసార్ట్స్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో రెండు కుటుంబాల వారు పాల్గొన్నారు. ఫిబ్రవరి 17వ తేదీన రాజా రెడ్డి- ప్రియా అట్లూరి వివాహం జరునున్న విషయం తెలిసిందే.
రాజకీయ ప్రముఖులు పరిమితంగా హాజరయ్యారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఏపీ, తెలంగాణకు చెందిన కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇందులో పాల్గొన్నారు. కాబోయే వధూవరులకు శుభాకాంక్షలను తెలియజేశారు.

ఊహించినట్టే- షర్మిల అన్న, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నిశ్చితార్థానికి హాజరయ్యారు. తన మేనల్లుడిని ఆశీర్వదించారు. తల్లి వైఎస్ విజయమ్మ, షర్మిలను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆయన వెంట చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. కొన్ని నిమిషాల పాటే వైఎస్ జగన్ అక్కడ గడిపారు. అనంతరం తాడేపల్లికి తిరుగుప్రయాణం అయ్యారు.
Congratulations to Raja and Priya.
— YS Sharmila (@realyssharmila) January 19, 2024
God bless your union and hold you together forever.
Thank all the loved ones that came and blessed the couple and all those that could not come but blessed in spirit. pic.twitter.com/5OkvFEcauB
కాగా- ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఓ వీడియో గ్లింప్సెస్‌ను వైఎస్ షర్మిల కొద్దిసేపటి కిందటే విడుదల చేశారు. దీన్ని తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. తన కుమారుడి నిశ్చితార్థ వేడుకకు తరలి వచ్చిన అతిథులకు హృదయ పూరక ధన్యవాదాలను తెలిపారు. స్నేహితులు, బంధువులు, అభిమానులు ఊహించిన దానికంటే ఎక్కువగా వచ్చారని పేర్కొన్నారు. భారీ సంఖ్యలో అభిమానులు తరలి రావడం వల్ల చిన్నపాటి అసౌకర్యం కలిగిందని, దీనికి చింతిస్తున్నానని అన్నారు.
నా కుమారుడు వైయస్ రాజారెడ్డి నిశ్చితార్థ వేడుకకు తరలివచ్చిన అతిథులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. స్నేహితులు, బంధువులు, అభిమానులు ఊహించిన దానికంటే ఎక్కువగా విచ్చేయడంతో చిన్నపాటి అసౌకర్యం కలిగిందని తెలిసి చింతిస్తున్నాను. నూతన వధువరులను మంచి మనసుతో ఆశీర్వదించిన మీ అందరికి… pic.twitter.com/BKaFtqFfUj
— YS Sharmila (@realyssharmila) January 19, 2024
కాగా నిమిషం 46 సెకెండ్ల నిడివి ఉన్న ఈ వీడియోలో తన అన్న వైఎస్ జగన్ ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడ్డారు షర్మిల. ఆయన కనిపించని విధంగా ఈ వీడియో గ్లింప్సెస్‌ను కట్ చేయించారు. స్వయంగా జగన్ పిలిచినప్పటికీ.. గ్రూప్ ఫొటో దిగడానికి షర్మిల రాలేదు. అన్నతో విభేధాలు ఉన్నాయనే విషయాన్ని ఆమె చెప్పకనే చెప్పినట్టయింది.
-
జగన్ మరో మెడికల్ కాలేజీల తరహా వార్నింగ్..!! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications