సైలెంట్‌గా ఆఫ్రికాకు వైసీపీ 'పెద్దాయన'?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ స్థాయిలో చక్రం తిప్పిన నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రెండో విడతలో సైతం మంత్రిగా కొనసాగారంటే ఆయన హవా ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. అటువంటి పెద్దిరెడ్డి పోలింగ్ తర్వాత నుంచి సైలెంట్ అయ్యారు. ఆయన విదేశాలకు వెళ్లిపోతున్నారంటూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేయడమే కాకుండా అందుకు తగ్గ వివరాలను ఆధారాలతో సహా వెల్లడించింది. ఆఫ్రికాలో మైనింగ్ కాంట్రాక్టులు చేయడానికి ముంబయి పోర్టు నుంచి వాహనాలను తరలించే పనిలో పెద్దిరెడ్డి ఉన్నారు.

అక్కడ వాహనాలు లేవా?
వాస్తవానికి ఆఫ్రికాలో మైనింగ్ చేయాలంటే అక్కడే యంత్రాలు, వాహనాలు ఉంటాయి. కానీ ఇక్కడి నుంచి పెద్దిరెడ్డి వాహనాలను తరలిస్తున్నారు. ఈ పనిమీద విదేశాలకు వెళుతున్నట్లుగా చెప్పొచ్చని, అలా ముందస్తుగా ప్లాన్ చేసుకున్నారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారు. కొడాలి నాని ఏమీ మాట్లాడటంలేదు. అంబటి రాంబాబు, రోజా, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ లాంటివారు కూడా సైలెంట్ అయ్యారు. వైసీపీలో పెద్ద మనిషిగా ఉన్న పెద్దిరెడ్డి గౌరవంగా ఉంటుందని విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.

ysr congress party senior leader peddireddy ramachandra reddy will to africa countries

వేధించడంలో ముందుండేవారు
చంద్రబాబునాయుడితోపాటు తెలుగుదేశం పార్టీ నేతలను వేధించడంలో పెద్దిరెడ్డి ముందుండేవారు. చిత్తూరు జిల్లా అంగళ్లులో బాబుపై హత్యాయత్నం చేసినంత పనిచేశాయి అల్లరి మూకలు. వాటివెనక పెద్దిరెడ్డి ఉన్నారనేది బహిరంగ రహస్యం. కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి పావులు కదిపారు. హిందూపురం నుంచి బాలకృష్ణను వెళ్లగొడతానన్నారు. వందల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టించారు. ఎన్నికలు వస్తే మొదటగా టార్గెట్ అయ్యేది కూడా పెద్దిరెడ్డే. పోలింగ్ కు ముందే పెద్దిరెడ్డితోపాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి కూడా సైలెంట్ అయ్యారు.

ప్రధానమంత్రే ప్రస్తావించారు
వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్దిరెడ్డి వ్యవహరించిన తీరుతో ప్రభుత్వం మారిన తర్వాత ఆయన వ్యాపారాలన్నీ మూతపడటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లొసుగులతో నిండిన వ్యాపారాలు కావడంతో ప్రభుత్వం మారితే కచ్చితంగా టార్గెట్ అవుతానని పెద్దిరెడ్డి కూడా భావించినట్లున్నారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ పీలేరులో మంత్రి పెద్దిరెడ్డి మాఫియా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+