వైఎస్సార్ అవార్డుల ప్రకటన-జాబితాలో గోపీచంద్, కరణం మల్లీశ్వరి...

ఏపీలో వైసీపీ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది వైయస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డులు, ఎచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రకటన చేసింది. 2023 సంవత్సరానికి గాను ఈ అవార్డుల్ని ప్రకటించారు. ఇందులో పలు రంగాలకు చెందిన వారు ఉన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఏటా ఈ అత్యున్నత అవార్డుల్ని ప్రకటిస్తోంది. ఎంపిక కమిటీలో సజ్జల రామకృష్ణారెడ్డి, దేవులపల్లి అమర్, జి.వి.డి.కృష్ణమోహన్‌తో పాటు, ముత్యాల రాజు, తుమ్మా విజయ్‌కుమార్‌ రెడ్డి, వివిధ శాఖల ప్రిన్సిపల్‌ సెక్రెటరీలు సభ్యులుగా ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రంగాలనుంచి లబ్ధ ప్రతిష్ఠుల్ని దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డులకు కమిటీ మూడేళ్ళుగా ఎంపిక చేస్తోంది. ఈసారి కూడా తమకు తాముగా దరఖాస్తు చేసుకున్న వారిని, జిల్లాల్లో కలెక్టర్లు జిల్లా యంత్రాంగం ద్వారా ఎంపిక చేసిన నామినేషన్లను కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిన తరవాత ఈ ఎంపిక చేశారు. ఈ ఏడాది 27 అవార్డుల్ని సిఫారసు చేసి, ముఖ్యమంత్రి ఆమోదం మేరకు కమిటీ ఈ ప్రకటన చేసింది. ఈ రోజు ప్రకటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైయస్సార్‌ అవార్డుల్లో 23 లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డులు, 4 ఎచీవ్‌మెంట్‌ అవార్డులు ఉన్నాయి.

ysr life time achievement awards and achievement awards 2023 announced- here is winners list

2023లో వైయస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్, ఎచీవ్‌మెంట్‌ అవార్డులకు ఎంపిక అయిన వారు- వారి జిల్లాల జాబితా:

వ్యవసాయం:
1) శ్రీమతి పంగి వినీత- (ఎచీవ్‌మెంట్‌ అవార్డు)
2) శ్రీ వై.వి.మల్లారెడ్డి- అనంతపురం

ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌:
1) శ్రీ యడ్ల గోపాలరావు- రంగస్థల కళాకారుడు- శ్రీకాకుళం
2) శ్రీ తలిసెట్టి మోహన్‌- కలంకారీ- తిరుపతి
3) శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి- హరికథ- బాపట్ల
4) శ్రీ కోన సన్యాసి- తప్పెటగుళ్ళు- శ్రీకాకుళం జిల్లా
5) ఉప్పాడ హ్యాండ్‌ లూమ్‌ వీవర్స్‌ కోఆపరేటివ్‌ సొసైటీ- కాకినాడ
6) శ్రీ ఎస్‌.వి.రామారావు- చిత్రకారుడు- కృష్ణా
7) శ్రీమతి రావు బాల సరస్వతి- నేపథ్య గాయని- నెల్లూరు
8) శ్రీ తల్లావఝుల శివాజీ- చిత్రకారుడు, రచయిత, పాత్రికేయుడు- ప్రకాశం
9) శ్రీ చింగిచెర్ల కృష్ణారెడ్డి- జానపద కళలు- అనంతపురం
10) శ్రీమతి కలీసాహెబీ మహబూబ్‌- షేక్‌ మహబూబ్‌ సుబానీ దంపతులకు- నాదస్వరం- ప్రకాశం

తెలుగు భాష- సాహిత్యం:
1) శ్రీ ప్రొఫెసర్‌ బేతవోలు రామబ్రహ్మం- పశ్చిమ గోదావరి
2) శ్రీ ఖదీర్‌ బాబు- నెల్లూరు- (ఎచీవ్‌మెంట్‌ అవార్డు)
3) శ్రీమతి మహెజబీన్‌- నెల్లూరు (ఎచీవ్‌మెంట్‌ అవార్డు)
4) నామిని సుబ్రహ్మణ్యం నాయుడు- చిత్తూరు
5) అట్టాడ అప్పలనాయుడు- శ్రీకాకుళం

క్రీడలు:
1) శ్రీ పుల్లెల గోపీచంద్‌- గుంటూరు
2) శ్రీమతి కరణం మల్లీశ్వరి- శ్రీకాకుళం

వైద్యం:
1) శ్రీ ఇండ్ల రామ సుబ్బారెడ్డి-మానసిక వైద్యం- ఎన్టీఆర్‌
2) ఈసీ వినయ్‌కుమార్‌రెడ్డి-ఈఎన్‌టీ- కాక్లియర్‌ ఇంప్లాంట్స్‌- వైయస్సార్‌

మీడియా:
1) శ్రీ గోవిందరాజు చక్రధర్‌- కృష్ణా
2) శ్రీ హెచ్చార్కే- కర్నూలు

సమాజ సేవ:
1) శ్రీ బెజవాడ విల్సన్‌- ఎన్టీఆర్‌
2) శ్రీ శ్యాం మోహన్‌- అంబేద్కర్‌ కోనసీమ- (ఎచీవ్‌మెంట్‌)
3) నిర్మల హృదయ్‌ భవన్‌- ఎన్టీఆర్‌
4 శ్రీ జి. సమరం- ఎన్టీఆర్‌

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+