విజయవాడ, గుంటూరు వైసీపీ మేయర్ అభ్యర్థులు వీళ్లే: సెకెండ్ లిస్ట్ లో.. !!
ఏపీలో వివిధ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించి మేయర్, ఛైర్మన్ అభ్యర్థుల మలి విడత జాబితాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. మున్సిపాలిటీలు- 10, నగర పంచాయతీలు- 7 చోట్ల పోటీ చేసే అభ్యర్థుల వివరాలను ఇందులో పొందుపరిచింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వివిధ సామాజిక వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తూ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తోంది.
రిజర్వేషన్ నిబంధనలకు అనుగుణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలు, మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది.. వైఎస్ఆర్సీపీ. స్థానికంగా ప్రజలతో మమేకమై పనిచేసే అనుభవం, ప్రజాదరణ కలిగిన నాయకులకే ఈ అవకాశాలు కల్పించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని అన్ని జిల్లాలను సమతుల్యం చేస్తూ అభ్యర్థులను ఎంపిక చేసింది. టీడీపీ కూటమికి ధీటుగా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి, స్థానిక సంస్థల్లో సుపరిపాలన అందించడానికి వారు అనుభవం ఉపయోగపడుతుందని భావిస్తోంది.

కార్పొరేషన్ మేయర్ అభ్యర్థులు
ఊహించినట్టే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా రాయన భాగ్యలక్ష్మి (నగరాలు సామాజికవర్గం)కి మరోసారి అవకాశం లభించింది. గుంటూరు అభ్యర్థిగా తాడికొండ అలివేలు వెంకట నాగపద్మ శ్రీదేవి (వైశ్య) పేరు ఖరారైంది. తిరుపతి మేయర్ రేసులో వై వాసుదేవ యాదవ్ (బీసీ) నిలిచారు. కర్నూలు కార్పొరేషన్ అభ్యర్థిగా ఊతకళ్ల సుశీల (మాదిగ), అనంతపురం బరిలో చిట్లూరు రమేష్ గౌడ దిగారు. చిత్తూరు నుంచి రామస్వామి చంద్రశేఖర్ (వన్నెకుల క్షత్రియ) పోటీలో నిలిచారు.
మున్సిపాలిటీల్లో
బొబ్బిలి- తుమ్మల అచ్యుతవళ్లి (తెలగ)
సాలూరు- బావిరెడ్డి రిబిక రాణి (గాజులకాపు)
అమలాపురం- దూదల వీరిత దేవి (కాపు)
జంగారెడ్డి గూడెం- మేకా సత్యవతి (గౌడ)
నూజివీడు- కంచర్ల లవకుమార్ (మాదిగ)
జగ్గయ్యపేట- షేక్ హఫీజున్నీసా (ముస్లిం)
పెడన- కటకం నాగకుమారి (దేవాంగ)
నాయుడుపేట- తంబిరెడ్డి రాజేశ్వరమ్మ (రెడ్డి)
సూళ్లూరుపేట- మోడీ విమల కుమార్ (మాల)
ఎమ్మిగనూరు- కోడిగంటి శివన్న రఘు (పద్మశాలి)
నగర పంచాయతీల్లో..
పాలకొండ- పాలవలస ఇందుమతి (తూర్పు కాపు)
ముమ్మడివరం- సానబోయిన సునీలా దేవి (శెట్టి బలిజ)
నందిగామ- చల్లా బ్రహ్మేశ్వర రావు (వైశ్య)
గిద్దలూరు- భూమా నరసింహా రెడ్డి (రెడ్డి)
అద్దంకి- వీ సురేష్ (వైశ్య)
చీమకుర్తి- మెడగం శ్రీదేవి (రెడ్డి)
దర్శి- వెన్నపూస వెంకట రెడ్డి (రెడ్డి)












Click it and Unblock the Notifications
