టీడీపీ ఎమ్మెల్యే ఎఫెక్ట్, పోలీసుల అదుపులో వైసీపీ లీడర్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, బెంగళూరులో !

వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నమోదు చేసిన కేసుల్లో కొందరు వైసీపీ నాయకుల పేర్లు తప్పించారని ఆరోపణలు ఉన్నాయి. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని మీద జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించి అదే నియోజక వర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగిందని నమోదు అయిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కోసం తిరుపతి పోలీసులు కొంతకాలంగా గాలిస్తున్నారు. బెంగళూరులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నాడని తెలుసుకున్న తిరుపతి పోలీసులు శనివారం బెంగళూరులో అతన్ని అదుపులోకి తీసుకున్నారని వెలుగు చూసింది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని తిరుపతి తీసుకెళ్లి న్యాయమూర్తి ముందు హజరుపరచడానికి పోలీసులు సిద్దం అయ్యారు.

YSRCP leader Chevireddy Mohit Reddy was arrested in the case of attempted murder of TDP MLA
మే 14వ తేదీన తిరుపతిలోని శ్రీ పద్మావతి మమిళా యూనివర్శిటీలోని స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించడానికి పులివర్తి నాని వెళ్లారు. ఆ సమయంలో కొందరు పులివర్తి నాని మీద ఇనుపరాడ్లు, సుత్తులు, బీరు బాటిల్స్ తో దాడి చెశారు. ఈ దాడుల్లో పులివర్తి నాని గన్ మెన్ కు తీవ్రగాయాలైనాయి, పులివర్తి నానికి కూడా గాయాలు అయ్యాయి. ఈ విషయంపై అప్పట్లో ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ అయ్యింది.

ఈ కేసుకు సంబంధించి అప్పటి చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు భానుకుమార్ రెడ్డి, గణపతి రెడ్డితో పాటు 13 మందిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. ఇదే కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పులివర్తి నాని మీద హత్యాయత్నం చేశారని నమోదు అయిన కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి 37వ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఈ కేసులో ఇప్పటి వరకు 24 మందిని పోలీసులు అరెస్టు అయ్యారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం పెద్దల ఒత్తిడితో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అరెస్టు చెయ్యలేదని ఆరోపణలు ఉన్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తరువాత సీన్ మొత్తం మారిపోయి ఎన్డీఏ ప్రభుత్వం అదికారంలోకి వచ్చింది. ప్రభుత్వం మారిపోవడంతో తిరుపతి పోలీసులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కోసం గాలించారు.

ప్రభుత్వం మారిపోవడంతో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా మాయం అయ్యారని ఆరోపణలు ఉన్నాయి. అయితే బెంగళూరులో మోహిత్ రెడ్డి తలదాచుకున్నారని పక్కా సమాచారంఅందుకున్న తిరుపతి పోలీసులు బెంగళూరు చేరుకుని చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని తిరుపతికి బయలుదేరి వెళ్లారని తెలిసింది. మొత్తం మీద టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని మీద హత్యాయత్నం జరిగిందని నమోదు అయిన కేసులో వైసీపీ నాయకుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు పట్టుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడే ఈ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+