పవన్ ఫాలోయింగ్ వెనుక, కేతిరెడ్డి సంచలనం: బాలకృష్ణకు సవాల్..!!

ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ లక్ష్యంగా కూటమి పార్టీ లు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. మాజీ సీఎం జగన్ ప్రజల్లోకి వచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. తాజాగా కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రాధాన్యత లేకపోవటం పైన కూటమి పైన రాజకీయంగా విమర్శలు మొదలయ్యాయి. ఇదే సమయంలో వైసీపీ ముఖ్య నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తాజాగా చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేసారు.

జగన్ - పవన్ క్రేజ్ ఏంటి
వైసీపీ ఎన్నికల్లో ఓడిన తరువాత ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీ ఓటమి వెనుక కారణాలను ఓపెన్ గా వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగానే తాజాగా కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఒక భావజాలం అం టూ లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ ఆయన చంద్రబాబు నీడలోనే ఉన్నారని చెప్పుకొ చ్చారు. తాను జగన్ తోనే ఉన్నానని, ఆయన భావజాలంతోనే పనిచేస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో క్రౌడ్ పుల్లర్స్ జగన్, పవన్ మాత్రమేనని పేర్కొన్నారు. అయితే, జగన్ కు రాజకీయంగా జనం వస్తారు.. పవన్ కల్యాణ్ కు మాత్రం సినిమాల పరంగానే జనం వస్తారంటూ కేతిరెడ్డి విశ్లేషించారు.

YSRCP leader Ketireddy challenge for Balakrishna Interestign comments on Pawan acting skills

బాలయ్యకు సవాల్
కమల్ హాసన్ కంటే పవన్ కల్యాణ్ గొప్ప నటుడు కాదని కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. కానీ, కమల్ హాసన్ ఎన్నికల్లో నిలబడితే ఓడిపోయారని గుర్తు చేసారు. 2009లో చిరంజీవి రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్కచోట మాత్రమే గెలిచారని చెప్పుకొచ్చారు. బాలక్రిష్ణ హిందూపురం కాబట్టి మూడు సార్లు గెలిచాడు.. అదే గుడివాడలో గెలవమనండి చూద్దాం అంటూ కేతిరెడ్డి సవాల్ చేసారు. తమిళనా డులో నటుడు విజయ్ కూడా పార్టీ పెట్టారని..పాలిటిక్స్ అంత ఈజీ కాదని పేర్కొన్నారు. వాళ్లు సినిమాల్లో మాత్రమే హీరోలు.. రియల్ లైఫ్ లో కాదు అని కేతిరెడ్డి వ్యాఖ్యానించారు.

కొంపలో సమస్యలు వదిలి
వైసీపీలో విజయసాయిరెడ్డికి సముచిత స్థానం కల్పించారన్నారు. జగన్ పక్కన లేకుంటే విజయ సాయి రెడ్డి ఓన్లీ ఆడిటర్ మాత్రమే అంటూ కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో విద్యలో జగన్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినా, దాన్ని ఎవరూ హర్షించలేకపోయారని విశ్లేషించారు. చంద్రబాబు మద్యం బాగా ఇస్తే చాలనుకుంటున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు మద్యం ముందు జగన్ ఇచ్చిన విద్య ఓడిపోయింది అంటూ కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. ఫీజులు కట్టలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. జనం మాత్రం సినిమా హీరోల గురించి మాట్లాడుతున్నారన్నారు. కొంపలో సమస్యలు పక్కన పెట్టి సినిమా హీరోల వెంట పోతున్ నారంటూ కేతిరెడ్డి వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+