ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు - ఫలితం పై క్లారిటీ..!?

ఏపీలో ఎన్నికల ఫలితాల పై ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సర్వే సంస్థలు పోప్ట్ పోల్ సర్వేలు చేస్తున్నాయి. పార్టీల అధినేతలు విదేశాల్లో సేద తీరుతున్నారు. అయితే...జగన్ గెలిస్తే విశాఖలో..చంద్రబాబు గెలిస్తే అమరావతిలో ప్రమాణ స్వీకారం ఉంటుందని రెండు పార్టీల నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో చోటు చేసుకుంటున్న ఆసక్తి కర పరిణామాలు ఫలితాల పై మరింత ఉత్సుకతను పెంచుతున్నాయి.

గెలుపు పై ధీమా
జగన్ పైన ఉన్న వ్యతిరేకత..మూడు పార్టీల కలయిక తమకు అధికారం వచ్చేలా చేస్తాయని టీడీపీ నేతలు ధీమాగా ఉన్నారు. కానీ, పోలింగ్ పూర్తయిన తరువాత ఇప్పటి వరకు టీడీపీ ముఖ్య నేతలు ఫలితాల పైన తమ అంచనాలన బహిరంగంగా వెల్లడించటం లేదు. కూటమి ముఖ్యులు మౌనంగా ఉంటున్నారు. ఇటు సీఎం జగన ఐప్యాక్ సమావేశంలో 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేసారు. పలు సర్వే సంస్థలు పోస్ట్ పోల్ సర్వేలు చేస్తున్నాయి. జగన్ రెండో సారి ముఖ్యమంత్రిగా జూన్ 9న ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించిన వైసీపీ నేతలు ముహూర్తం సైతం ప్రకటించారు.

YSRCP Leaders booking tickets for Vizag Ofificials visit in steel city leads to new Predictions

విశాఖలో అధికారులు
ఇక, ఏపీలో కీలక స్థానంలో ఉన్న ఇద్దరు ముఖ్య అధికారులు తాజాగా విశాఖ నగరంలో పర్యటించారు. జగన్ ప్రమాణ స్వీకారం అక్కడే ఉంటుందని చెబుతున్న వేళ ఈ ఇద్దరు అధికారుల పర్యటన పైన రాజకీయంగా చర్చ సాగుతోంది. విశాఖలో లో జూన్-9 నాటికి ముందస్తుగా హోటల్ రూమ్ లు కూడా బుక్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల హోటల్స్ లో రూమ్ లు బ్లాక్ చేసి పెట్టినట్టు చెబుతున్నారు. వీఐపీలు, వీవీఐపీల కోసం ఏర్పాట్లు చేస్తున్నారట స్థానిక నేతలు. రిజల్ట్ వచ్చాక ప్రమాణ స్వీకారోత్సవ వేదిక ఫిక్స్ అవుతుందని అంటున్నారు. అయితే, ఆంధ్రా యూనివర్సిటీ గ్రైండ్స్ లో కార్యక్రమం ఉంటుందని విశాఖ వైసీపీ నేతల్లో చర్చ సాగుతోంది.

ప్రమాణ స్వీకార ముహూర్తం
ఇటు చంద్రబాబు గెలిస్తే అమరావతి పరిధిలో ప్రమాణ స్వీకారం ఉంటుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. టీడీపీ కూడా పోటీగా అదే డేట్ ఫిక్స్ చేసింది. చంద్రబాబు సీఎంగా జూన్-9 ప్రమాణ స్వీకారం చేస్తారని గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఏపీలో గెలుపుపై ఇటు వైసీపీ ధీమాగా ఉంది, అటు కూటమి కూడా అంతే నమ్మకంగా గెలిచేది తామేనంటోంది. సర్వేల సారాంశాన్ని ఎవరికి వారు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో కన్ఫ్యూజన్ కనిపించలేదు. ఎవరు గెలిచినా మెజార్టీ భారీగా ఉండకపోవచ్చనే వాదన కూడా బలంగా వినపడుతోంది. ఇలా భిన్నమైన అంచనాల సమయంలో అధికారం...ప్రమాణ స్వీకారం అంశం మరింత ఉత్కంఠ పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+