ప్రధాని మోదీకి వైసీపీ కొత్త ప్రతిపాదన- ఏం జరుగుతోంది..!!

ఏపీ రాజకీయాల్లో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం వైసీపీ లక్ష్యంగా అడుగులు వేస్తోంది. కేంద్రం జమిలి దిశగా కసరత్తు చేస్తున్న వేళ ఏపీలో చంద్రబాబు - పవన్ అప్రమత్తం అవుతున్నారు. పాలనా పరంగా - రాజకీయంగా కొత్త వ్యూహాలు అమలుకు సిద్దం అవుతున్నారు. అటు మాజీ సీఎం జగన్ జనవరి నెలాఖరు నుంచి జిల్లాల పర్యటనలకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఈ సమయంలోనే వైసీపీ ఎంపీ గురుమూర్తి ప్రధాని మోదీకి లేఖ రాసారు. కీలక అంశాలను ప్రస్తావించారు.

ప్రధానికి లేఖ
ఏపీలో కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది. 2014 లో ఇవే మూడు పార్టీలు కలిసి కట్టుగా అధికారంలోకి వచ్చాయి. కానీ, నాడు జనసేన ప్రభుత్వంలో భాగస్వామిగా లేదు. 2019 ఎన్నికల ముందు ఎన్డీఏ నుంచి నాటి పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు బయటకు వచ్చారు. ఆ తరువాత ఎన్నికల్లో జగన్ విజయం సాధించారు. అప్పటి నుంచి 2024 ఎన్నికల వరకు కేంద్రం లో మోదీ ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించారు. తాజా ఎన్నికల్లో తిరిగి టీడీపీ, జనసేన తో బీజేపీ జత కట్టింది. వైసీపీ ఎన్నికల్లో ఓడిపోయింది. ఆ తరువాత కేంద్ర పెద్దలతో వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

YSRCP MP Gurumoothy proposes holding Parliament sessions in south India see details

తాజా ప్రతిపాదన
ఇక, ఇప్పుడు వైసీపీ ఎంపీ గురుమూర్తి తాజాగా ప్రధాని మోదీకి లేఖ రాశారు.ఈ లేఖలో కీలక ప్రతిపాదన చేసారు. దక్షిణ భారత్‌లో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని కోరారు. అదే విధంగా..ఏడాదికి కనీసం రెండు పార్లమెంట్ సెషన్స్ దక్షిణ భారత రాష్ట్రాల్లో నిర్వహించాలని తన లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీలో తీవ్రమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దక్షిణాదిలోనూ పార్లమెంట్‌ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ప్రధానితో పాటుగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజులకు ఆయన లేఖ రాశారు. ఢిల్లీలోని వాతారవణం వల్ల ఎంపీల పనితీరుపై ప్రభావం పడుతుందని వివరించారు.

కొత్త చర్చగా
మరి కొన్ని కీలక అంశాలను లేఖలో ప్రస్తావించారు. దక్షిణాదిన పార్లమెంట్‌ సమావేశాలు నిర్వహించడం వల్ల జాతీయ సమగ్రత మరింత పెరుగుతుందని గురుమూర్తి వివరించారు. ఈ విషయమై 1968లో స్వతంత్ర ఎంపీ ప్రకాశ్‌వీర్‌ శాస్త్రి ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు కూడా పెట్టారని ఆ లేఖలో గుర్తు చేశారు. ఇప్పుడు గురుమూర్తి రాసిన లేఖ పైన దక్షిణాది ఎంపీల్లో చర్చ జరుగుతోంది. మరి, కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదన పైన ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+