పవన్ కల్యాణ్ డెంగ్యూ, చికెన్ గున్యా దోమలాంటివాడు... విజయసాయిరెడ్డి సెటైర్లు
జనసేన అధినేత పవన్ కళ్యాన్‌తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విజయసాయి రెడ్డి మరోసారి ట్వీట్ల వర్షం కురిపించారు. రాష్ట్రంలో ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టడంతో రేగిన దుమారం పవన్ కళ్యాన్ మరియు అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్దానికి దారి తీస్తోంది. ఈనేపథ్యంలోనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వ్యక్తిగత దూషణలకు సైతం దిగారు. దీంతో ఏపీ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్లతో రెచ్చిపోయారు. పవన్ కల్యాణ్, చంద్రబాబుపై వేసిన ట్వీట్లు ఇవే..
‘నిత్యకళ్యాణం’ పవన్ కళ్యాన్
ఇంగ్లీష్ మీడియంపై దుమారం రేగుతున్న సమయంలో పవన్ కళ్యాన్‌ను విమర్శిస్తూ ఎంపీ విజయసాయి రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. తన ట్విట్టర్ ద్వారా ''నిత్యకళ్యాణం '' సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారంటే పలు వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. పవన్ కళ్యాన్ సీజన్‌లో వచ్చిపోయే డెంగ్యూ , చికెన్ గున్యా వ్యాప్తి చేసే దోమ లాంటి వాడని, వర్షాకాలంలో ఎగిరేగిరి పడి , శీతాకాలం, ఎండాకాలంలో కనిపించకుండా పోతాడట. ఇన్నాళ్లు నడిచిందోమో కాని ఇకపై దోమలకు కష్టకాలమే'' అంటూ ట్వీట్ చేశారు.
చంద్రబాబు, పవన్ కళ్యాన్‌కు తేడా లేదు.
అంతకు ముందు మరో ట్వీట్ చేశారు. దళితులకు రాజకీయాలెందుకని బండబూతులు తిట్టిన చింతమనేనికి, బలహీనవర్గాల బిడ్డలకు ఇంగ్లీష్ మీడియం చదువులు ఎందుకని ప్రశ్నిస్తున్న చంద్రబాబు , పవన్ కళ్యాన్‌కు ఎలాంటీ తేడా లేదని , వీళ్లకు పెదోళ్లన్నా, నిమ్నవర్గాల వారన్నా... చాల చిన్న చూపు అని పేర్కొన్నారు. వారు ఎన్నికల్లో చిత్తుగా ఓడించినందుకు ప్రజలపై ఇంకా కసి పెంచుకున్నారని అన్నారు.
కరువు దీక్ష చేస్తే ఎముకలు మెడలో వేసుకుంటాడా...
మరోవైపు చంద్రబాబు చేపట్టిన ఇసుక దీక్షపై కూడ విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇసుక దీక్షలో మెడకు ఇసుక పొట్లాల దండ వేసుకున్నాడని ఎప్పుడైన కరువుపై దీక్ష చేస్తే... ఎముకల హారం చుట్టుకునేలా ఉన్నాడని అన్నాడు. ఆయన ఫ్రస్టేషన్లో ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. ఇక ఇసుక దీక్షకు ఫ్లేక్సిలు, పోస్టర్లు, జెండాలు కట్టినంత జనాలు కూడ చంద్రబాబు చేపట్టిన దొంగదీక్షకు హజరు కాలేదని పేర్కొన్నారు.
-
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications