Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్పిన వైవీ సుబ్బారెడ్డి

Vice President of India: ఉపరాష్ట్రపతి ఎన్నిక గడువు సమీపించింది. ఇంకొక్క రోజే బాకీ ఉంది. ఎల్లుండి.. అంటే ఈ నెల 9వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో దేశరాజధానిలో రాజకీయాలు వేడెక్కాయి. తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఎన్డీఏ- ఇండియా బ్లాక్ వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి. ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గెలుపు నల్లేరు మీద నడకే.

ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎలక్టోరల్ కాలేజీలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఉంటారు. రాజ్యసభకు నామినేట్ అయిన సభ్యులు కూడా ఈ ఎన్నికలలో ఓటు వేయడానికి అర్హులు. రాజ్యసభలోని 233 మంది ఎన్నికైన సభ్యులు, 12 మంది నామినేటెడ్ సభ్యులు ఉన్నారు. లోక్‌సభలో 543 మంది సభ్యులు.. తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. వారందరూ ఎలక్టోరల్ కాలేజీలో భాగం.

YSRCP MP YV Subba Reddy met CP Radhakrishnan in Delhi

ప్రస్తుతం లోక్ సభలో ఒకటి, రాజ్యసభలో అయిదు ఖాళీలు ఉన్నాయి. ఆ ఒక్కటీ- పశ్చిమ బెంగాల్ లోని బసీర్ హట్ నియోజకవర్గం. ఈ స్థానానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న తృణమూల్ కాంగ్రెస్ లోక్ సభ సభ్యుడు హాజీ నూరుల్ ఇస్లాం.. కన్నుమూశారు. ఇంకా ఇక్కడ ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. 245 మంది సభ్యుల బలం ఉన్న రాజ్యసభలో అయిదు ఖాళీలు ఉన్నాయి. ఈ అయిదింట్లో నాలుగు జమ్మూ కాశ్మీర్ కు చెందినవే. మరొకటి పంజాబ్ కు చెందినది. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజీవ్ అరోరా అసెంబ్లీకి ఎన్నిక కావడం వల్ల ఈ ఖాళీ ఏర్పడింది.

దీంతో ఎలక్టోరల్ కాలేజీలో ఓటు హక్కు వినియోగించుకునే సభ్యుల బలం 782. ఈ ఎన్నికలలో గెలవడానికి అభ్యర్థికి 391 ఓట్లు అవసరం. అధికార ఎన్డీఏ కూటమికి ఈ ఎన్నికలలో స్పష్టమైన ఆధిక్యత ఉంది. లోక్‌సభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు 542 మంది సభ్యులలో 293 మంది మద్దతు ఉంది. రాజ్యసభలో ఎన్డీఏకు 129 మంది సభ్యుల మద్దతు ఉంది. నామినేటెడ్ సభ్యులు కూడా ఎన్డీఏ అభ్యర్థికే ఓటు వేస్తారని భావిస్తున్నారు. మొత్తంగా ఎన్డీఏ కూటమికి 422 మంది సభ్యుల మద్దతు ఉంది.

ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ వైవీ సుబ్బారెడ్డి.. కొద్దిసేపటి కిందటే సీపీ రాధాకృష్ణన్ ను కలిశారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో ఈ భేటీ ఏర్పాటైంది. మర్యాదపూరకంగా రాధాకృష్ణన్ ను కలిశారు. ఈ నెల 9వ తేదీన జరగబోయే ఎన్నికల్లో ఎన్డీఏకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. గెలుపు ఖాయమేనని ధీమా వ్యక్తం చేశారు. ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+