వైసీపీ నాలుగో సిద్దం సభ వేదిక, ముహూర్తం ఖరారు - కీలక ప్రకటన..!!
వైసీపీ 'సిద్ధం' నాలుగో సభ ఖరారైంది. ఎన్నికలకు కేడర్ ను సిద్దం చేసే క్రమంలో పార్టీ సిద్దం సభలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన మూడు సభలు సక్సెస్ అయ్యాయి. నాలుగో సిద్దం సభ నిర్వహణకు వేదిక, ముహూర్తం ఖరారు చేసారు. మూడు ఉమ్మడి జిల్లాల నుంచి కేడర్ హాజరు కానుంది. ఈ సభా నిర్వహణ బాధ్యతలను పార్టీ ముఖ్య నేత విజయ సాయిరెడ్డి తీసుకున్నారు. చివరి సిద్దం సభ ద్వారా సీఎం జగన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.
వైసీపీ నాలుగో సిద్దం సభ మార్చి 3న బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో నిర్వహణకు నిర్ణయించారు. రాప్తాడులో నిర్వహించిన సభను మించి మేదరమెట్ల సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సిద్ధం సభకు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల కార్యకర్తలు హాజరుకానున్నారు.

సిద్దం సభ నిర్వహణ పైన నాలుగు జిల్లాలకు చెందిన నేతలతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇప్పటికే నిర్వహించిన మూడు సభలకంటే మరింత ప్రతిష్ఠాత్మకంగా ఈ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. టీడీపీ కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీ సిద్దం సభలను నిర్వహిస్తోంది.
నాలుగు ముఖ్యమైన రీజియన్‌లలోని నాలుగు ప్రాంతాల్లో సిద్ధం సభలు పూర్తి అయిన తర్వాత పార్టీలో, ప్రభుత్వంలో కీలక సమావేశం ఉండవచ్చు. ఆ తర్వాత పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అద్దంకి సిద్దం సభలోనే ఎన్నికల వరాలపై సీఎం జగన్ కీలక ప్రకటన చేస్తారని సమాచారం. సభ నిర్వహణ పైన సాయిరెడ్డి పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసారు.

పిచ్చికలగుడిపాడు గ్రామ వద్ద జరుగుతుందని చెప్పారు..భీమిలి, ఏలూరు, రాప్తాడు సభలు ఎలా అయితే విజయవంతంగా నిర్వహించారో అదే విధంగా అద్దంకి సభను కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గత మూడు సమావేశాలు విజయవంతమైన తరువాత తెలుగుదేశం పార్టీ నైతిక స్ధైర్యం దెబ్బతిందని..ఆ పార్టీ సంగ్ధిద్దంలో పడిపోయిందన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications