Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ పై వడ్డీ రేటు పెంపు..మీ ఆర్థిక భవిష్యత్తు సురక్షితం..!

ఇండియన్ ఫైనాన్స్ లో విశ్వసనీయమైన పేరు బజాజ్ ఫైనాన్స్ ఇటీవలి వడ్డీ రేటు పెంపు ద్వారా పెట్టుబడిదారులకు తమ ఫిక్స్డ్ డిపాజిట్స్ (ఎఫ్‎డి) లను మరింత ఆకర్షణీయంగా చేసింది. మీరు మీ పొదుపు పై రిటర్న్స్ సంపాదించుకొనుటకు ఒక సురక్షితమైన మరియు ఊహించదగిన విధానాన్ని కోరుకుంటే, మీరు బజాజ్ ఫైనాన్స్ ఎఫ్డిని పరిగణించవచ్చు.

ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటే ఏమిటి?
మీ పౌదుపు పై వడ్డీ సంపాదించుకొనుటకు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఒక సురక్షితమైన మరియు సామాన్యమైన విధానాన్ని అందిస్తాయి. మీరు ఒక ఆర్ధిక సంస్థలో కొన్ని రోజుల నుండి అనేక సంవత్సరాల వరకు ఉండే, ముందుగా నిర్ణయించబడిన కాలవ్యవధి వరకు ఒక ఏకమొత్తం డబ్బును పెట్టుబడి పెడతారు. దీనికి బదులుగా, ఆ సంస్థ ఆ డిపాజిట్ కాలవ్యవధికి మీకు ఒక ఫిక్స్డ్ వడ్డీ రేటును చెల్లించుటకు ఒప్పుకుంటుంది.

Bajaj finance limited increase the interest rate on its fixed deposits-Apply online

బజాజ్ ఫైనాన్స్ ఇటీవలి ఎఫ్‎డి రేటు పెంపు
బజాజ్ ఫైనాన్స్ 15-60 నెలల కాలవ్యవధి ఉన్న ఎఫ్‎డిల కొరకు వడ్డీ రేట్లను వార్షికానికి 0.60% వరకు పెంచింది. దీనితో అధిక రిటర్న్స్ కోరుకునే పెట్టుబడిదారులకు ఎఫ్‎డిలు మరింత కాంపెటీటివ్ అవుతాయి.

బజాజ్ ఫైనాన్స్ ఎఫ్‎డి యొక్క కీలక విశేషాలు
1. అధిక వడ్డీ రేట్లు: బజాజ్ ఫైనాన్స్ భారతదేశములో అత్యధిక ఎఫ్‎డి రేట్లను అందిస్తుంది. వయోవృద్ధులు (60 సంవత్సరాలు పైబడిన వయసు ఉన్నవారు) వార్షికానికి 8.85% వరకు సంపాదించుకుంటారు, కాగా 60 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు ఏడాదికి 8.60% వరకు సంపాదించుకుంటారు.

2. డిజిటల్ సౌకర్యము: సుదీర్ఘమైన పత్రాలను పూరించడము లేదా క్యూలలో వేచి ఉండటాన్ని మరచిపోండి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ సులభమైనది మరియు మీ ఇంటి నుండే సౌకర్యవంతంగా కొన్ని నిమిషాలలోనే పూర్తి చేయవచ్చు. బజాజ్ ఫిన్సర్వ్ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా మీ బజాజ్ ఫైనాన్స్ ఎఫ్‎డిని బుక్ చేసుకోండి మరియు నిర్వహించుకోండి.

3. ఫ్లెక్సిబుల్ కాలవ్యవధి: మీ ఆర్ధిక లక్ష్యాలు ప్రత్యేకమైనవి అని బజాజ్ ఫైనాన్స్ అర్థంచేసుకుంటుంది. అందుకే వాళ్ళు ఎఫ్‎డిల కొరకు 12 నెలలు మొదలుకొని 60 నెలల వరకు ఉండే కాలవ్యవధులను అందిస్తారు. ఈ ఫ్లెక్సిబిలిటి వలన మీరు:
a. స్వల్ప-కాలిక లక్ష్యాలను సాధించవచ్చు: మీరు ఒక డౌన్ పేమెంట్, సెలవులు లేదా అత్యవసర నిధి కొరకు పొదుపు చేస్తూ ఉంటే, స్వల్పకాలిక కాలవ్యవధుల వలన మీరు కాంపెటీటివ్ వడ్డీని సంపాదించుకుంటూనే మీ డబ్బును తొందరగా పొందగలుగుతారు.
b. దీర్ఘ-కాలము కొరకు ప్రణాళిక చేయవచ్చు: ఒక రిటైర్మెంట్ నిధి లేదా భవిష్యత్ విద్యాభ్యాస ఖర్చుల కోసం నిధులను ఏర్పాటు చేసుకున్నప్పుడు విస్తరించబడిన కాలవ్యవధుల కొరకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ఉంటాయి.

4. పేఅవుట్ ఎంపికలు: బజాజ్ ఫైనాన్స్ మీ ఎఫ్‎డి పై సంపాదించుకున్న వడ్డీని మీరు ఎలా మరియు ఎప్పుడు అందుకుంటారు అనేదానిపై నియంత్రణను అందిస్తుంది. ఈ ఎంపికల నుండి ఎంచుకోండి:

a. నెల/త్రైమాసిక/అర్ధ-వార్షిక పేఅవుట్స్: మీ జీతానికి అనుబంధంగా ఉండేందుకు లేదా మళ్ళీమళ్ళీ ఉండే ఖర్చులను కవర్ చేయడానికి, ముఖ్యంగా పదవీవిరమణ చేసిన వారికి, ఉత్తమంగా ఉండే విధంగా క్రమబద్ధమైన ఆదాయాన్ని ఉత్పన్నం చేసుకోండి.
b. వార్షిక పేఅవుట్స్: ప్రతి సంవత్సరం చివరిలో ఒక పెద్ద మొత్తాన్ని అందుకోండి, ఇది తిరిగి పెట్టుబడి పెట్టటానికి లేదా గణనీయమైన కొనుగోళ్ళు చేయటానికి ఉపయోగపడవచ్చు.
c. మెచ్యూరిటి పేఅవుట్: మీ ఎఫ్‎డి కాలవ్యవధి చివరిలో మీ ప్రిన్సిపల్ మరియు పోగైన వడ్డీని, రెండిటిని ఒకే ఏకమొత్తములో అందుకోండి, తద్వారా మీ మొత్తం రిటర్న్స్ ను అత్యధికం చేసుకోండి.

5. సురక్షత & కీర్తి: బజాజ్ ఫైనాన్స్ 5 లక్షలకు పైగా సంతోషకరమైన వినియోగదారులు మరియు రూ. 50,000 కోట్లకు మించిన డిపాజిట్స్ తో బాగా-స్థిరపడిన ఒక ఆర్ధిక సంస్థ. వారి [ఐసిఆర్‎ఏ]ఏఏఏ(స్టేబుల్) మరియు సిఆర్‎ఐఎస్‎ఐఎల్ ఏఏఏ/స్టేబుల్ రేటింగ్స్ అంటే మీ పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది అని అర్థం.

6. వయోజన పౌరులకు ప్రత్యేక ప్రయోజనాలు: బజాజ్ ఫైనాన్స్ వయోజన పౌరులకు అదనపు వడ్డీ (వార్షికంగా 0.40% వరకు) అందించి పదవీవిరమణ పొందినవారిని ప్రాధాన్యీకరిస్తుంది, తద్వారా వారి ఎఫ్‎డిలను ఈ వర్గానికి మరింత ప్రయోజనకారిగా అవుతాయి.

బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ ను ఆన్లైన్ లో ఎలా బుక్ చేసుకోవచ్చు
బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టుబడి పెట్టడం ఒక సులభమైన ప్రక్రియ. ఈ సుళువైన దశలను అనుసరించండి:
1. బజాజ్ ఫిన్సర్వ్ యాప లేదా వెబ్సైట్ ను సందర్శించండి
2. 'పెట్టుబడులు' విభాగానికి నావిగేట్ అవ్వండి మరియు 'ఫిక్స్డ్ డిపాజిట్' పై క్లిక్ చేయండి
3. ఆన్లైన్ దరఖాస్తు పత్రాన్ని ఓపెన్ చేయడానికి పేజ్ పై భాగములో ఉన్న 'ఓపెన్ ఎఫ్‎డి' పై క్లిక్ చేయండి.
4. మీ 10-అంకెల మొబైల్ నంబరును ఎంటర్ చేయండి మరియు మీ ఫోన్ కు పంపించబడిన ఓటిపి ని ధృవీకరించండి
5. పెట్టుబడి మొత్తాన్ని పూరించండి, పెట్టుబడి కాలవ్యవధిని మరియు పేఅవుట్ ఫ్రీక్వెన్సీని ఎంచుకోండి. మీ పాన్ మరియు పుట్టినతేదిని ఎంటర్ చేయండి.
6. మీ కేవైసి పూర్తి చేయండి: ఒకవేళ మీరు ప్రస్తుత వినియోగదారుడు అయితే, మా వద్ద ఉన్న వివరాలను ధృవీకరించండి లేదా మార్పు చేయటానికి ఎడిట్ చేయండి. కొత్త వినియోగదారులకు, ఆధార్ కార్డ్ ఉపయోగించి మీ కేవైసి పూర్తి చేయండి.
7. ఒక ప్రకటన డిస్ప్లే అవుతుంది. దయచేసి దానిని జాగ్రత్తగా చదవండి మరియు నియమ నిబంధనలను అంగీకరించండి. మీ బ్యాంక్ వివరాలను ఎంటర్ చేయండి మరియు చెల్లించటానికి కొనసాగండి.
8. నెట్ బ్యాంకింగ్/యూపిఐ లేదా ఎన్‎ఈఎఫ్‎టి నెట్/ఆర్‎టిజిఎస్ ఉపయోగించి మీ పెట్టుబడిని పూర్తి చేయండి

ముగింపు
మీరు ఒక నిర్దిష్ట లక్ష్యము కొరకు ఆదా చేస్తున్నా, ఒక అత్యవసర నిధి ఏర్పాటు చేస్తున్నా, లేదా మీ డబ్బు పెరుగుతూ ఉండగా దానిని రక్షించుకోవాలని అనుకున్నా, బజాజ్ ఫైనాన్స్ ఎఫ్‎డి ఒక సురక్షితమైన మరియు ప్రతిఫలం అందించే ఒక పరిష్కారాన్ని అందిస్తుంది. వారి కాంపెటీటివ్ వడ్డీ రేట్లు, ఫ్లెక్సిబుల్ ఫీచర్స్ మరియు వినియోగదారుడి సంతృప్తి కొరకు నిబద్ధత కలిగి ఉండటము అన్నీ వారిని భారతదేశములో పెట్టుబడిదారుల కొరకు ఉత్తమ ఎంపికగా చేస్తాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+