daughter: కూతురు గట్టిగా కౌగిలించుకుని తల్లిని వదల్లేదు, బయటకు వెళ్లిన తల్లీ, పెద్ద కూతురు!

ఇంట్లో 10 నెలల చిన్నారి తల్లిని కౌగిలించుకుని నన్ను వదిలి వెళ్లకూడదని బోరున ఏడ్చింది. మీ అక్కను స్కూల్లో దింపి వస్తానని చెప్పిన తల్లి కారులో ఇంటి నుంచి బయలుదేరి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.

బెంగళూరు: ఇంట్లో 10 నెలల చిన్నారి తల్లిని కౌగిలించుకుని నన్ను వదిలి వెళ్లకూడదని బోరున ఏడ్చింది. మీ అక్కను స్కూల్ లో దింపి వస్తానని చెప్పిన తల్లి కారులో ఇంటి నుంచి బయలుదేరి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. మరో కూతురిని స్కూల్ లో డ్రాప్ చెయ్యడానికి కారులో వెలుతున్న సమయంలో ఆకారుపై కాంక్రీట్ సిమెంట్ లారీ పట్టీ కొట్టడంతో తల్లీకూతుళ్లు ఇద్దరూ దుర్మరణం చెందిన సంఘటన బెంగళూరు నగరం శివార్లలో జరిగింది.

బెంగళూరు నగర శివార్లలోని కగ్గలిపుర సమీపంలోని తరాళు ప్రాంతంలో నివాసం ఉంటున్న ఐటీ ఉద్యోగి గాయత్రి కుమార్ (47), ఆమె పెద్ద కూతురు సమత కుమార్ (16) మృతి చెందారు. తల్లీకూతరు ఇద్దరూ ఒకేసారి దురదృష్టవశాత్తు చనిపోయాడు. పెద్ద కూతురు సమతను ఆమె తండ్రి సునీల్ కుమార్ ఎప్పుడూ ఇంటి నుంచి పిలుచుకుని వెళ్లి స్కూల్‌లో దించేవాడు. అయితే ఈరోజు ఆఫీసులో మీటింగ్ ఉందని హడావుడిగా ఆఫీసుకు వెళ్లిన సునీల్ కుమార్ ఇంట్లో ఉన్న భార్య గాయత్రికి పెద్ద కూతురుని స్కూల్లో దింపమని చెప్పాడు.

A mother and daughter died after a car collided with a cement mixing lorry near Bengaluru

కూతురిని స్కూలులో డ్రాప్ చసేందుకు కారులో వెలుతున్న తల్లీకూతుళ్లు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. పిల్లలు దేవుడితో సమానం అని పెద్దలు చెబుతుంటారు. ఆ మాట ఇక్కడ అక్షరాల నిజయం అయ్యింది, చిన్నారికి ఆమె తల్లి చనిపోంతుందని ముందుగానే తెలిసి ఆమె బయటకు వెళ్లకుండా బోరున విలపించిందని, అయినా బయటకు వెళ్లిన తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని బాధితురాలి కుటుంబ సభ్యులు అంటున్నారు.

గాయత్రి 10 నెలల కూతురు ఆమె తల్లి ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా గట్టిగా కౌగిలించుకుని ఎక్కిళ్లు పెట్టి మరీ ఎడ్చిందని, ఏడుపు ఆపిన గాయిత్రీ పాపను మా చేతుల్లో పెట్టి కారులో పెద్దకూతురుతో కలిసి వెళ్లిందని ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మార్గం మధ్యలో సిమెంట్ కాంక్రీట్ మిక్సింగ్ నింపుకు ని వెలుతున్న లారీ గాయిత్రీ, ఆమె కూతురు ప్రయాణిస్తున్న కారుపై పల్టీకొట్టడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులోనే తీవ్రగాయాలైన గాయిత్రీ, ఆమె కూతురు ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారని పోలీసులు అన్నారు. ప్రమాదం జరిగిన తరువాత లారీ డ్రైవర్ పరారైనాడని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+