Bengaluru: బెంగళూరులో అపరిచితుడు సీన్.. విద్యుదాఘాతంతో మహిళతో పాటు చిన్నారి మృతి..
మీరు అపరిచితుడు(Aparichitudu) సినిమా చూసే ఉంటారు.. అందులో విక్రమ్(Vikram) చిన్నతనంలో తన చెల్లి చనిపోతుంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ వైరు తెగి కింద పడుతుంది. అప్పుడే వర్షం కురుస్తుంది. దీంతో విక్రమ్ చెల్లి అటగా వెళ్లి విద్యుత్ ఘాతానికి గురి చనిపోతోంది. దీనిపై విక్రమ్ తండ్రి కోర్టుకు వెళ్లినా ఫలితం ఉండదు. దీంతో విక్రమ్ వింతగా మారి.. నిర్లక్ష్యం వహించిన అధికారులను చంపుతుంటాడు. అయితే అది సినిమా.. మరి నిజ జీవితంలో అలా జరుగుతుందా అంటే.. అవును జరిగింది.
బెంగళూరు(Bengaluru)లో రోడ్డు పక్కన ఫుట్ పాత్ పై ఉన్న విద్యుత్ వైరుపై ఓ మహిళ చూసుకోకుండా కాలు వేయడంతో విద్యుదాఘాతానికి గురై ఓ ఆమెతో పాటు తొమ్మిది నెలల పాప కన్నుమూశారు. బెంగళూరుకు చెందిన 23 ఏళ్ల సౌందర్య, ఆమె 9 నెలల కుమార్తె తమిళనాడు నుంచి బెంగళూరుకు తిరిగి వచ్చారు. ఫుట్ పాత్ పై నడుచుకుంటు వెళ్తున్న క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం 6 గంటలకు ఈ సంఘటన జరిగింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

రోడ్డు పక్కన పడి ఉన్న లైవ్ వైర్ బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్ (బెస్కామ్)కి చెందినదని గుర్తించారు. సర్వీస్ ప్రొవైడర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు ప్రారంభించామని, సంబంధిత బెస్కామ్ అధికారులు, సిబ్బందిని విచారిస్తున్నామని డీసీపీ వైట్‌ఫీల్డ్ ఒక ప్రకటనలో తెలిపారు. చీకట్లో రోడ్డుపక్కన కరెంటు తీగ గుర్తుపట్టకుండా పడి ఉంది. ఘటన జరిగిన వెంటనే తల్లి, బిడ్డ మృతి చెందారని పేర్కొన్నారు.
గతేడాది సెప్టెంబరులో బెంగళూరులో వర్షాల కారణంగా నీరు నిలిచిన రోడ్డుపై జారిపడి విద్యుదాఘాతానికి గురై ఓ బాలిక మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు బెస్కామ్‌పై ఫిర్యాదు చేశారు. అంతకుముందు ఏప్రిల్, 2022లో, బెంగళూరులో 22 ఏళ్ల వ్యక్తి కేబుల్ వైర్‌తో తాకడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ ఘటన జరిగినప్పుడు ఆ వ్యక్తి తన సోదరుడితో కలిసి పార్కు సమీపంలోని ఫుట్ పాత్ పై నడుచుకుంటూ వెళ్తున్నాడు. సినిమాలో అయితే విక్రమ్ ఆ అధికారులను శిక్షించాడు. కానీ నిజజీవితంలో నిర్లక్ష్యం వహించిన అధికారులను ఎవరు శిక్షిస్తారు అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications