డీకే శివకుమార్ హెలికాప్టర్ పక్కనే మంటలు వ్యాపించి ?, రెండో సారి డీకేశీ మిస్?
బెంగళూరు/ హున్నావర్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చెయ్యడానికి ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ నటీనటులు హెలికాప్టర్లలో తిరుగుతున్నారు. కర్ణాటకలోని పలు జిల్లాల్లోని పలు నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచారం చెయ్యడానికి సుమారు 150 హెలికాప్టర్లను రాజకీయ నాయకులు అద్దెకు తీసుకున్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్, మాజీ సీఎంలు బీఎస్ యడియూరప్ప, హెచ్ డీ. కుమారస్వామి, సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్, స్టార్ హీరోలు సుదీప్, దర్శన్, డాక్టర్ శివరాజ్ కుమార్ తదితరులు ఎన్నికల ప్రచారం చెయ్యడానికి హెలికాప్టర్లను ఆశ్రయిస్తున్నారు. పలు నియోజక వర్గాల్లో అందరూ ప్రచారం చేస్తున్నారు.

కేపీసీసీ అధ్యక్షుడు గురువారం ఎన్నికల ప్రచారం చెయ్యడానికి హున్నావర సమీపంలోని రామతీర్థకు వెళ్లారు. డీకే. శివకుమార్ ప్రయాణించిన హెలికాప్టర్ ల్యాండ్ అయిన హెలిప్యాడ్ పక్కనే ఉన్న ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సమీపంలోనే డీకే. శివకుమార్ ప్రయాణించిన హెలికాప్టర్ ఉండటంతో స్థానికులు హడలిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు, అగ్నిమాపక సిబ్బంది స్మోక్ క్యాండిల్స్ ఉపయోగించి వెంటనే మంటలు అదుపు చేశారు. మైసూరులో ఎన్నికల ప్రచారం పూర్తి చేసుకున్న డీకే. శివకుమార్ అక్కడి నుంచి నేరుగా హున్నావర వెళ్లి ఎన్నికల ప్రచారం చెయ్యడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగిందని అధికారులు అంటున్నారు.
ఇటీవల కేపీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం రేస్ లో ఉన్న డీకే శివకుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను హెచ్ఏఎల్ సమీపంలో గాలిలోనే గద్ద ఢీకొడంతో అందరూ హడలిపోయారు. అయితే పైలెట్ చాకచక్యంగా హెలికాప్టర్ ను హ్యాండిల్ చేసి ల్యాండ్ చెయ్యడంతో పెద్ద ప్రమాదం తప్పిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.
అయితే గద్ద ఢీకొనడంతో హెలికాప్టర్ గాజు అద్దాలు పీస్ పీస్ అయ్యాయి. డీకే శివకుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్లకు వరుసగా అపశకునాలు ఎదురుకావడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ విషయంలో మాజీ మంత్రి, ట్రుబల్ షూటర్, కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శికుమార్ ఇంత వరకు మీడియా ముందు క్లారిటీ ఇవ్వలేదు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications