కర్నాటక హైకోర్టులో హిజాబ్ నిషేధంపై విచారణ- ఆసక్తికర వాదనలు- ఖురాన్ సూక్తుల పఠనం
కర్నాటకలోని విద్యాసంస్ధల్లో హిజాబ్ పై నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ ముస్లిం విద్యార్ధులు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో ఇావాళ విచారణ జరిగింది. కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ దీక్షిత్ ఆధ్వర్యంలో ఈ విచారణ జరుగుతోంది. విచారణ సందర్భఁగా పలు ఆసక్తికర వాదనలు చోటు చేసుకున్నాయి.
కర్నాటక హైకోర్టులో విచారణ ప్రారంభం కాగానే... ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి కళాశాలలో ప్రవేశించడానికి అనుమతించమని పిటిషనర్ తరఫు న్యాయవాది అభిషేక్ జనార్దనన్ న్యాయమూర్తిని కోరారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి కృష్ణదీక్షిత్.. తాము హేతుబద్ధంగా చట్టం ప్రకారం వెళ్తామని, అభిరుచి భావోద్వేగాల ద్వారా కాదుని, రాజ్యాంగం చెప్పిన దాని ప్రకారం నడుచుకుంటామన్నారు. జోక్యం చేసుకున్న మరో అడ్వకేట్ మహమ్మద్ తాహిర్.. విద్యాసంవత్సరం ముగింపుకు ఇంకా రెండునెలలు మాత్రమే ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే ఈ రెండు నెలల పాటు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆగొచ్చు కదా అని న్యాయమూర్తి అడ్వకేట్ జనరల్ నుద్దేశించి వ్యాఖ్యానించారు.

పవిత్ర ఖురాన్ సూచించినట్లుగా, తలకు కండువా (హిజాబ్) ధరించడం తప్పనిసరి మతపరమైన ఆచరణలో భాగమని న్యాయమూర్తి దీక్షిత్ పేర్కొన్నారు. అలాగే మహిళలు తమకు నచ్చిన దుస్తులు ధరించడం భావవ్యక్తీకరణ హక్కులో భాగమని న్యాయవాది కామత్ తెలిపారు. దీంతో ఏకీభవించిన జడ్జి... హిజాబ్ ధరించడం అనేది ఆర్టికల్ 19(1)(a) పరిమితి ప్రకారం భావవ్యక్తీకరణ హక్కు యొక్క లక్షణాన్ని కలిగి ఉంటుందన్నారు. అలాగే హిజాబ్ ధరించడం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుట్టుస్వామి గతంలో ఇచ్చిన తీర్పుకు విరుద్ధమన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను కూడా కోర్టు తప్పుబట్టింది. అదే సమయంలో న్యాయమూర్తి ఖురాన్ ప్రకారం హిజాబ్ ధరించడం ముస్లిం మహిళలకు తప్పనిసరన్న వాదనను ఖురాన్ ప్రదర్శిస్తూ న్యాయవాదులకు చెప్పారు. ఆ తర్వాత న్యాయవాది కామత్ కూడా ఖురాన్ లో హిజాబ్ ధారణ తప్పనిసరి చేస్తున్నపేరాల్ని చదివి వినిపించారు. ఆ తర్వాత అడ్వకేట్ జనరల్, న్యాయవాది కామత్ మధ్య కేరళ హైకోర్టు ఇచ్చిన రెండు తీర్పులపై వాదోపవాదాలు జరిగాయి. అనంతరం బోంబే హైకోర్టు, తమిళనాడు హైకోర్టు ఇచ్చిన పలు తీర్పులపైనా న్యాయవాదుల మధ్య వాదనలు చోటు చేసుకున్నాయి. మధ్యలో జోక్యం చేసుకున్న జస్టిస్ దీక్షిత్ పలువురి వాదనలను సమర్ధించారు. అయితే ఇవాళ కోర్టు సమయం ముగియడంతో రేపు మధ్యాహ్నం రెండున్నర గంటలకు వాదనలు వింటామని చెప్పి విచారణ ముగించారు.












Click it and Unblock the Notifications