Reverse: అన్న భార్య హత్యకు మరిది రూ. 25 లక్షలు డీల్, మరిది ప్లాన్ కు రివర్స్ డీల్ మాట్లాడిన వదిన, క్లైమాక్స్!
బెంగళూరు/విజయపుర: అన్నదమ్ములు సంతోషంగా కలసిమెలసి ఉండేవారు. అన్నకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో పెళ్లి చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల తరువాత తమ్ముడికి బీఎస్ఎఫ్ లో ఉద్యోగం వచ్చింది. ప్రమాదంలో అన్న చనిపోవడంతో వదినకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఒకే ఇంటిలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. కొంతకాలం తరువాత వదిన వేరుకుంపటి పెట్టి ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయింది. మా వదిన మమ్మల్ని నమ్మించి మోసం చేసిందని, ఆమె వేరే వ్యక్తితో అక్రమ సంబందం పెట్టుకుని జీతం, అన్న చనిపోయిన తరువాత వచ్చిన డబ్బులు మొత్తం అతనికి ఇస్తోందని బీఎస్ఎఫ్ లో ఉద్యోగం చేస్తున్న మరిది రగిలిపోయాడు.
కిరాయి హంతకులతో వదిన హత్యకు ఆమె మరిది రూ. 25 లక్షలకు డీల్ మాట్లాడుకున్నాడు. అనుకున్న ప్రకారం హంతకులు ఆఫీసు నుంచి ఇంటికి వెలుతున్న వదినను కిడ్నాప్ చేశారు. అయితే వదినను హత్య చేస్తామని బీఎస్ఎఫ్ ఉద్యోగితో డీల్ మాట్లాడుకున్న హంతకులతో క్లైమాక్స్ లో కిడ్నాప్ అయిన వదినతో రివర్స్ డీల్ మాట్లాడుకోవడంతో కథ రసవత్తరంగా మారింది.

అన్నదమ్ములు హ్యాపీ
కర్ణాటకలోని విజయపుర నగరంలో లక్ష్మీపతి, రమేష్ అనే అన్నదమ్ములు నివాసం ఉంటున్నారు. అన్నదమ్ములు అంటే లక్ష్మీపతి, రమేష్ లాగా ఉండాలని ఆ చుట్టుపక్కలవాళ్లు అనుకునేవారు. రమేష్ అన్న లక్ష్మీపతికి ప్రభుత్వ ఉద్యోగం రావడంతో అతను లక్ష్మీ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. భార్య లక్ష్మీతో కలిసి లక్ష్మీపతి అతని కుటుంబ సభ్యులతోనే జీవించేవాడు.

అన్న ఉద్యోగం వదినకు వచ్చింది
లక్ష్మీపతికి ఉద్యోగం వచ్చిన కొన్ని సంవత్సరాల తరువాత అతని తమ్ముడు రమేష్ కు బీఎస్ఎఫ్ లో ఉద్యోగం వచ్చింది. 2008లో ప్రమాదంలో లక్ష్మీపతి చనిపోవడంతో అతని భార్య లక్ష్మీకి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఒకే ఇంటిలో రమేష్, అతని వదిన లక్ష్మీ ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు.

వేరే కాపురం పెట్టిన వదిన
కొంతకాలం ఉమ్మడి కుటుంబంలోనే ఉన్న లక్ష్మీ తరువాత వేరుకుంపటి పెట్టి ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయింది. భర్త లక్ష్మీపతి కుటుంబ సభ్యులతో విడిపోయిన తరువాత లక్ష్మీ విజయపురలోనే ఆమె కుటుంబ సభ్యులతో కలిసి జీవించడం మొదలుపెట్టింది. మా వదిన లక్ష్మీ మమ్మల్ని నమ్మించి మోసం చేసిందని బీఎస్ఎఫ్ ఉద్యోగి రమేష్ రగిలిపోయాడు.

వదిన మీద అనుమానం.... రూ. 25 లక్షలకు డీల్
వదిన లక్ష్మీ వేరే వ్యక్తితో అక్రమ సంబందం పెట్టుకుని నెలనెల వస్తున్న జీతం, అన్న లక్ష్మీపతి చనిపోయిన తరువాత వచ్చిన డబ్బులు మొత్తం ప్రియుడికి ఇస్తోందని బీఎస్ఎఫ్ లో ఉద్యోగం చేస్తున్న మరిది రమేష్ అనుమానం పెంచుకున్నాడు. విజయపురలో నివాసం ఉంటున్న కిరాయి హంతకులు శివాజీ, సాగర్, ఆదర్శ్, ఆకాష్ లతో వదిన లక్ష్మీని హత్య చేస్తే రూ. 25 లక్షలు ఇస్తానని మరిది రమేష్ డీల్ మాట్లాడుకున్నాడు.

వదినను కిడ్నాప్ చేసిన తరువాత ?
విజయపురలో ప్రభుత్వ ఉద్యోగ చేస్తున్న లక్ష్మీ ఇంటికి బయలుదేరింది. ఆ సందర్బంలో కిరాయి హంతకులు లక్ష్మీని ఓ వాహనంలో కిడ్నాప్ చేసి నిర్జనప్రదేశంలోకి తీసుకెళ్లారు. ఆ సందర్బంలో మేము మీ వదిన లక్ష్మీని కిడ్నాప్ చేశామని, రూ. 25 లక్షలు డబ్బులు మా అకౌంట్ లో వేస్తే లక్ష్మీని చంపేస్తామని కిరాయి హంతకులు రమేష్ కు ఫోన్ చేసి చెప్పారు.

చంపేసి వాట్సాప్ లో ఫోటో పంపించండి
మా వదిన లక్ష్మీని చంపేసి ఆమె ఫోటో వాట్సాప్ లో పంపిస్తేనే మీ అకౌంట్ లో డబ్బులు వేస్తానని, లేదంటే డబ్బులు ఇవ్వనని రమేష్ చెప్పాడు. కనీసం అడ్వాన్స్ గా అయినా రూ. 5 లక్షలు ఇవ్వాలని కిరాయి హంతకులు బీఎస్ఎఫ్ ఉద్యోగి రమేష్ కు మనవి చేశారు. ఒక్కరూపాయి కూడా ఇవ్వను, ముందు మా వదిన లక్ష్మీని చంపేసి ఫోటో పంపించడం తరువాత డబ్బులు ఇస్తానని రమేష్ తేల్చి చెప్పాడు.

వదినతో రివర్స్ డీల్
డబ్బులు ఇవ్వడానికి రమేష్ నిరాకరించడంతో హంతకులు ఆలోచించి కిడ్నాప్ చేసిన లక్ష్మీతో రివర్స్ డీల్ మాట్లాడుకున్నారు. నిన్ను చంపమని మీ మరిది రూ. 25 లక్షలకు డీల్ మాట్లాడుకున్నాడు. నిన్ను చంపకుండా వదిలేస్తాము, మాకు రూ. 5 లక్షలు ఇవ్వు అని చెప్పారు. లక్ష్మీ వెంటనే హంతకుల్లో ఓ యువకుడి మొబైల్ ఫొన్ తీసుకుని ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రూ. 5 లక్షలు తీసుకుని రివాలని చెప్పింది. అయితే లక్ష్మీ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఏదో అనుకుంటే ఏదో జరిగిపోయింది
పోలీసులు పక్కాప్లాన్ తో కిరాయి హంతకులను పట్టుకుని లక్ష్మీని రక్షించారు. కిరాయి హంతకులు రివర్స్ డీల్ మాట్లాడుకోవడంతో సినిమా ఫక్కీలో పోలీసులకు చిక్కిపోయారు. వదిన లక్ష్మీని హత్య చెయ్యడానికి రూ. 25 లక్షలకు డీల్ మాట్లాడుకున్న బీఎస్ఎఫ్ ఉద్యోగి రమేష్ ను అరెస్టు చెయ్యడానికి పోలీసులు రంగం సిద్దం చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications