Bride: పెళ్లి కొడుకు నల్లగా ఉన్నాడని రివర్స్, పెళ్లికూతురిని నరికి చంపేసిన అన్న, బంధువులు షాక్ !
బెంగళూరు/రాయచూరు: స్నేహితులు అందరూ వారికి నచ్చిన అబ్బాయిలను చూసి వివాహం చేసుకుని సంతోషంగా ఉంటున్నారని, నేను కూడా నాకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలని ఓ యువతి బావించింది. అయితే కరోనా వైరస్ మహమ్మారి తాండవం చేస్తున్న సమయంలోనే అమ్మాయి కుటుంబ సభ్యులు ఓ పెళ్లి సంబంధం చూశారు. అబ్బాయి చూడటానికి చాలా నల్లగా ఉన్నాడని, ఈ పెళ్లి నేను చేసుకోనని అమ్మాయి తేల్చి చెప్పింది. మేము చెప్పిన చోట నువ్వు పెళ్లి చేసుకోవాలి అంతే అంటూ అమ్మాయి కుటుంబ సభ్యులు మూర్ఖంగా ప్రవర్తించారు. పెళ్లి ఏర్పాట్లు అన్ని పూర్తి చేసేశారు. పెళ్లిరోజు నేను ఈ పెళ్లి చేసుకోనని అడ్డం తిరిగిన పెళ్లి కూతురిని ఆమె అన్న గొడ్డలితో నరికి చంపడం కలకలం రేపింది.

వయసుకు వచ్చిన కూతురు
కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోని దేవదుర్గ తాలుకాలోని కప్పుర ప్రాంతంలో చంద్రకళ అనే యువతి నివాసం ఉంటున్నది. చంద్రకళ పెళ్లిఈడుకు రావడంతో ఆమె పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించారు. కొంతకాలం నుంచి చంద్రకళకు ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.

అందంగా ఉన్న మొగుడు కావాలి
స్నేహితులు అందరూ వారికి నచ్చిన అబ్బాయిలను చూసి వివాహం చేసుకుని సంతోషంగా ఉంటున్నారని, నేను కూడా నాకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలని చంద్రకళ బావించింది. అయితే కరోనా వైరస్ మహమ్మారి తాండవం చేస్తున్న సమయంలోనే చంద్రకళ కుటుంబ సభ్యులు ఓ పెళ్లి సంబంధం చూసి పెళ్లి కొడుకుని ఫిక్స్ చేసేశారు.

పెళ్లి కొడుకు నల్లగా ఉన్నాడు
పెళ్లి కొడుకు చూడటానికి చాలా నల్లగా ఉన్నాడని, ఈ పెళ్లి నేను చేసుకోనని చంద్రకళ తేల్చి చెప్పింది. మేము చెప్పిన చోట నువ్వు పెళ్లి చేసుకోవాలి అంతే అంటూ చంద్రకళ కుటుంబ సభ్యులు మూర్ఖంగా ప్రవర్తించారు. ఇదే విషయంలో చంద్రకళకు, ఆమె కుటుంబ సభ్యుల మద్య ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి.

ఎదురు తిరిగిన పెళ్లి కూతురు
చంద్రకళ పెళ్లి చేసుకోను అని మొండికి వేస్తున్న సమయంలో ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లు అన్ని పూర్తి చేసేశారు. జులై 13వ తేదీన ముహూర్తం ఫిక్స్ చేసేశారు. చంద్రకళ పెళ్లి ఆమె బంధువులు అందరూ వచ్చేశారు. పెళ్లికి అందరూ వచ్చిన సమయంలోనే చంద్రకళ నేను పెళ్లి చేసుకోనని ఎదురు తిరిగింది.

పెళ్లి కూతురిని గొడ్డలితో నరికి చంపిన అన్న
ఇంట్లో పెళ్లి కూతురు చంద్రకళ ఎదురు తిరగడంతో పెళ్లికి వెళ్లిన వారు షాక్ అయ్యారు. అ సమయంలో సహనం కోల్పోయిన చంద్రకళ సోదరుడు శ్యామ్ సుందర్ హంగామా చేశాడు. సహనం కోల్పోయిన శ్యామ్ సుందర్ గొడ్డలి తీసుకుని పెళ్లి కూతురు చంద్రకళ మీద దాడి చేశాడు. తీవ్రగాయాలైన చంద్రకళను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స విఫలమై చంద్రకళ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పెళ్లి కొడుకు నల్లగా ఉన్నాడని ఎదురు తిరిగిన పెళ్లి కూతురు చంద్రకళ హత్యకు గురి కావడం కలకలం రేపింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications