Cricketer: వివాదంలో చిక్కుకున్న మహిళా క్రికెటర్, బ్యూటీపార్లల్ ప్రాడెక్ట్స్ కోసం వెళ్లి సూపర్ మార్కెట్ లో?
బెంగళూరు/విజయపుర: భారతదేశంలో మహిళల క్రికెట్ జట్టుకు ప్రతేక గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. పురుషులకు మేము ఏమీ తక్కువ కాదని మహిళా క్రికెట్ జట్టు సభ్యులు నిరూపించుకున్నారు. ఇటీవల మహిళా క్రికెట్ జట్టు సభ్యులు పురుషులతో పోటీ పడుతున్ననారు. భారత మహిళ క్రికెట్ .జట్టులో ఉన్న యువతి బ్యూటీపార్లల్ ప్రాడెక్ట్స్ కోసం వెళ్లి సూపర్ మార్కెట్ లో రాద్దాంతం చేశారని ఆరోపణలు ఉన్నాయి.
అలాంటి భారత మహిళా క్రికెట్ జట్టులో మంచి పేరు ప్రతిష్టలు సంపాధించుకున్న యువతి వివాదంలో చిక్కుకున్నారు. భారత మహిళా క్రికెట్ జట్టులో రాజేశ్వరి గైక్వార్ చోటు సంపాధించుకున్నారు. భారత మహిళా క్రికెట్ జట్టులో రాజేశ్వరి గైక్వాడ్ మంచి పేరు తెచ్చుకున్నారు.

కర్ణాటకలోని విజయపురలోని సోల్లాపుర రోడ్డులోని ఓ సూపర్ మార్కెట్ లో బ్యూటీపార్లల్ కు సంబంధించిన ఉత్పత్తులు తీసుకోవడానికి రాజేశ్వరి ఆమె స్నేహితులు వెళ్లారు. ఆ సందర్బంలో సూపర్ మార్కెట్ సిబ్బందితో క్రికెట్ రాజేశ్వరికి గొడవ జరిగిందని తెలిసింది. ఆ సందర్బంలో మహిళా క్రికెటర్ రాజేశ్వరి గైక్వాడ్ కొంత మంది గూండాలను పిలిపించుకుని సూపర్ మార్కెట్ సిబ్బంది మీద దాడి చేసిందని ఆరోపణలు ఉన్నాయి.
India women's cricketer Rajeshwari Gayakwad involved in altercation at super market pic.twitter.com/ZDDxqWfiW1
— Sanju Here 🤞👻 (@me_sanjureddy) December 1, 2022
అయితే మహిళా క్రికెటర్ రాజేశ్వరితో ఈ విషయాన్ని ఖండించారు. తాను సూపర్ మార్కెట్ లో ఎలాంటి గొడవ చెయ్యలేదని రాజేశ్వరి అన్నారు. సూపర్ మార్కెట్ లో గొడవ జరిగిందని ఎలాంటి ఫిర్యాదు రాలేదని స్థానిక పోలీసు అధికారులు అంటున్నారు. మొత్తం మీద భారతదేశం తరపున మహిళా క్రికెట్ రంగంలో ఉన్న రాజేశ్వరి గైక్వాడ్ వివాదంలో చిక్కుకున్నారని కన్నడ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications