బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bengaluru: తోడు దొంగలు, 60 చోట్ల చోరీలు, జడ్జ్ ఇంటిని వదలని కాలాంతకులు, క్లైమాక్స్ లో!

దొంగతనాలు చేసి లగ్జరీగా కారులో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అరవై సార్లు చోరీలు చేశారు. ఇంతకాలం పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరిగారు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: దొంగతనాలు చేసి లగ్జరీగా కారులో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అరవై సార్లు చోరీలు చేశారు. ఇంతకాలం పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరిగారు. విచిత్రం ఏమిటి అంటే నిందితులు ఓ జడ్జి ఇంటికి కన్నం వేసి చాకచక్యంగా తప్పించుకుని పారిపోయారు. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడంతో పోలీసులకు చిక్కిపోయారు.

Dealing: అర్దరాత్రి ముంబాయి మేడమ్స్ తో చెడింది, పోలీసులపై దాడి, అమ్మాలు+లాయర్ల పంచాయితీతో!Dealing: అర్దరాత్రి ముంబాయి మేడమ్స్ తో చెడింది, పోలీసులపై దాడి, అమ్మాలు+లాయర్ల పంచాయితీతో!

అరెస్టు అయిన దొంగల పేర్లు, ప్రసాద్, ఫయాజ్. ఇద్దరిది ఒకే వయసు. బెంగళూరు నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో నిందితులు చోరీలు చేస్తున్నారు. బెంగళూరు నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో నిందితులు ప్రసాద్, ఫయాజ్ పలు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఈ ఇద్దరు పేరుమోసిన దొంగలను బెంగళూరులోని హెణ్ణూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

Two thieves who burglarized 60 houses, looted jewels and cash from the judges house and enjoyed in Bengaluru

నిందితులు ఫయాజ్, ప్రసాద్ కోలార్‌లో ఓ జడ్జిగారి ఇంటిని కూడా వదలకుండా ఆయన ఇంటిలో చోరీ చేశారని వెలుగు చూడటంతో పోలీసులు హడలిపోయారు. ఇళ్లను మాత్రమే టార్గెట్ గా చేసుకుంటున్న నిందితులు ఫయాజ్, ప్రసాద్ డబ్బులు చోరీ చేసి లగ్జరీ కారులో వివిధ రాష్ట్రాలు, పట్టణాలకు వెళ్లి దోచుకుంటున్నారని, బంగారాన్ని తాకట్టు పెట్టి సరదాగా గడిపుతున్నారని పోలీసులు అన్నారు. నిందితులు చోరీ చెయ్యడానికి ప్రయత్నిస్తున్న సమయంలో బెంగళూరులోని హెణ్ణూరు పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.

Car: కారు సన్ రూఫ్ లో జంట రొమాన్స్, చల్లగాలిలో 'పిల్ల'గాలికి ప్రియుడు, సైరా మామా అంటూ లేడీ?Car: కారు సన్ రూఫ్ లో జంట రొమాన్స్, చల్లగాలిలో 'పిల్ల'గాలికి ప్రియుడు, సైరా మామా అంటూ లేడీ?

నిందితుల నుంచి 660 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి ఇళ్లలో చోరీలు చేస్తున్న ముగ్గురు దొంగలను రామమూర్తి నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కరణ్, శంకర్, కిరణ్ అనే ముగ్గురిని అరెస్ట్ చేసి వారి నుంచి నాలుగు లక్షల విలువైన బంగారం, 1.5 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో శంకర్ డెలివరీ బాయ్ వేషంలో ఇళ్లకు మార్కులు వేస్తుండగా, మిగిలిన కిరణ్, కరణ్ పథకం వేసి బంగారం, డబ్బు దోచుకుంటున్నారని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Two thieves who burglarized 60 houses, looted jewels and cash from the judge's house and enjoyed in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X