బిగ్‌బాస్‌లో సరికొత్త ప్రయోగం: ఎలిమినేషన్‌కు బదులుగా ఇన్విజిబుల్: ఏమిటది?

ముంబై: బిగ్‌బాస్ రియాలిటీ షోలో మరో సరికొత్త ప్రయోగానికి తెర తీశారు నిర్వాహకులు. వారం వారం ఉత్కంఠత కలిగించేలా కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ ప్రక్రియను నిర్వహిస్తూ వస్తోన్న నిర్వాహకులు.. ఈ సారి కొత్తగా ఇన్విజిబుల్ ప్రక్రియను తెర మీదికి తీసుకొచ్చారు. తొలి ప్రయత్నంగా బిగ్‌బాస్-14లో దీన్ని అమలు చేయనున్నారు. ఇది విజయవంతమైతే.. మిగిలిన ప్రాంతీయ భాషల్లో ప్రసారం అవుతోన్న బిగ్‌బాస్ ఎపిసోడ్లలో దీన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

హిందీలో ప్రసారమౌతోన్న బిగ్‌బాస్-14 సీజన్‌లో ఈ సారి ఎలిమినేషన్ ఉండే అవకాశాలు దాదాపుగా లేనట్టే. ఎలిమినేషన్‌కు బదులుగా ఇన్విజిబుల్ అనే ప్రక్రియను తెరమీదికి తీసుకొచ్చారు షో నిర్వాహకులు. బిగ్‌బాస్-14 సీజన్‌లో ఈ సారి షెహజాద్ డియోల్, అభినవ్ శుక్లా, జాన్ కుమార్ సాను ఎలిమినేషన్‌లో ఉన్నారు. ఈ సారి ఎలిమినేషన్ ప్రక్రియ ఉండబోదని, దానికి బదులుగా ఇన్విజిబుల్‌గా ఉండాల్సి ఉంటుందని హోస్ట్ సల్మాన్ ఖాన్ వెల్లడించారు. షెహజాద్ డియోల్.. ఇన్విజిబుల్‌గా ఉంటారని తెలిపారు.

BIgg Boss 14: No Elimination This Week, Shehzad Deol To Stay as Invisible In the House

ఇన్విజిబుల్ మెంబర్ అంటే.. బిగ్‌బాస్ హౌస్‌లో ఎలాంటి కార్యకలాపాల్లోనూ అతను భాగస్వామిగా ఉండడు. బిగ్‌బాస్ ఇచ్చే టాస్క్‌లోనూ పాలుపంచుకునే అవకాశం ఉండదు. నిర్ణయాత్మక అంశాలకు సంబంధించిన డిస్కషన్స్‌లో ఇన్విజిబుల్ మెంబర్ భాగం పంచుకోడు. ఒకరకంగా చెప్పాలంటే.. హౌస్‌లో ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే అనే విధానంలో సాగుతుంది ఇది. బిగ్‌బాస్ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకూ ఆ కంటెస్టెంట్.. ఇన్విజిబుల్‌గానే ఉండాల్సి వస్తుంది.

బిగ్‌బాస్ జారీ చేసే ఆదేశాల ప్రకారం నడచుకోవాల్సి ఉంటుంది. అప్పుడు కూడా అతని ప్రవర్తన నచ్చకపోతే.. ఏ క్షణమైనా హౌస్ నుంచి బయటికి వెళ్లాల్సి ఉంటుంది. హిందీ బిగ్‌బాస్-14 సీజన్‌లో ఇన్విజిబుల్ మెంబర్‌గా షెహజాద్ డియోల్‌ను ఎంపిక చేశారు. హీనా ఖాన్, గౌహర్ ఖాన్, సిద్ధార్థ్ శుక్లాలు ముగ్గురు జూనియర్ హౌస్‌మేట్స్‌ను ఎలిమినేషన్ కోసం ఎంపిక చేశారు. ఈ ప్రక్రియ విజయవంతమైతే మిగిలిన ప్రాంతీయ భాషల్లో దీన్ని అమలు చేయొచ్చని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+