Amazon : అదిరిపోయే ఆఫర్లు. సంక్రాంతికి బిగ్ సేల్
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పింది. అమెజాన్ మైక్రోసైట్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం, 'అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026' జనవరి 16 నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫ్యాషన్, కిచెన్ ప్రాడక్ట్స్‌తో పాటు రోజువారీ అవసరాలపై కూడా భారీ తగ్గింపులు అందించనుంది.
రిపబ్లిక్ డే సందర్భంగా సేల్(Amazon Great Republic Day Sale 2026)లో ప్రత్యేక ఆకర్షణగా SBI క్రెడిట్ కార్డులు, SBI EMI లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందించనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. బ్యాంక్ ఆఫర్లతో పాటు ఎక్స్చేంజ్ డీల్స్, నో-కాస్ట్ EMI ఆప్షన్లు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. ప్రైమ్ సభ్యులకు సాధారణ వినియోగదారుల కంటే ముందుగానే సేల్ యాక్సెస్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

డీల్స్ విషయానికి వస్తే, స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రముఖ బ్రాండ్ల 5G ఫోన్లు, ఫ్లాగ్‌షిప్ మోడళ్లపై ధర తగ్గింపులతో పాటు బ్యాంక్ ఆఫర్లు కలిపి మరింత తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్ టీవీలు, వైర్‌లెస్ ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్‌లపై కూడా స్పెషల్ డీల్స్ ఉండనున్నట్లు అమెజాన్ సూచించింది.
అలాగే వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్లు వంటి హోమ్ అప్లయన్సెస్‌పై భారీ ధర తగ్గింపులు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందించనుంది. ఫ్యాషన్ విభాగంలో టాప్ బ్రాండ్ల దుస్తులు, ఫుట్‌వేర్, వాచ్‌లు, బ్యాగ్స్‌పై సీజనల్ డిస్కౌంట్లు లభించనున్నాయి. గృహోపకరణాలు, ఫర్నిచర్, కిచెన్ ఎసెన్షియల్స్‌పై కూడా ప్రత్యేక సేల్ ధరలు ప్రకటించే అవకాశం ఉంది.
అమెజాన్ తెలిపిన ప్రకారం, ఈ రిపబ్లిక్ డే సేల్‌లో లైట్నింగ్ డీల్స్, డీల్ ఆఫ్ ద డే, బ్లాక్‌బస్టర్ ఆఫర్లు వంటి విభాగాలు ప్రత్యేకంగా ఉండనున్నాయి. పరిమిత కాలం పాటు మాత్రమే ఉండే ఈ డీల్స్ కోసం వినియోగదారులు ముందుగానే తమ కార్ట్‌లో ప్రాడక్ట్స్ జోడించుకోవాలని సూచిస్తోంది.
మొత్తంగా చూస్తే, కొత్త సంవత్సరం ప్రారంభంలోనే ఎలక్ట్రానిక్స్ లేదా గృహ అవసరాల కొనుగోళ్లకు ప్లాన్ చేస్తున్న వారికి అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 మంచి అవకాశంగా మారనుంది. జనవరి 16 నుంచి ప్రారంభమయ్యే ఈ సేల్‌లో బ్యాంక్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లతో షాపింగ్ అనుభూతిని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు అమెజాన్ సిద్ధమవుతోంది.
రిపబ్లిక్ డే సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ తన సేల్ వివరాలను నిన్న (జనవరి 8) వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 17 వ తేదీ నుంచి ప్రారంభం కానుందని తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్, ప్లస్ మెంబర్లు 24 గంటల ముందుగానే సేల్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపింది. HDFC బ్యాంకు క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ ను అందిస్తామని వెల్లడించింది. అయితే డీల్స్ సహా ఇతర వివరాలు వెల్లడి కాలేదు












Click it and Unblock the Notifications