బాలీవుడ్ క్వీన్స్ vs లగ్జరీ కార్లు: హీరోయిన్ల గ్యారేజీలో 'కోట్ల' ఖజానా!
సినీ ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లు తమ లైఫ్‌స్టైల్‌లో భాగంగా లగ్జరీ కార్ల పట్ల ప్రత్యేకంగా అభిమానాన్ని కనబరుస్తారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు అలియా భట్, కత్రినా కైఫ్, దీపికా పదుకొణె, కరీనా కపూర్, శ్రద్ధా కపూర్ వంటి స్టార్ నటీమణులు లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు. ముంబై నగరంలో వీరి ఖరీదైన మెర్సిడెస్ మేబ్యాక్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్, లంబోర్ఘిని హురాకాన్, రోల్స్ రాయిస్ వంటి వాహనాలు తరచుగా కనిపిస్తుంటాయి. ప్రస్తుతం దేశంలో ఉన్న టాప్ 10 బాలీవుడ్ హీరోయిన్లు కలిగి ఉన్న అత్యంత ఖరీదైన కార్ల వివరాలు, వాటి అంచనా ధరలతో సహా తెలుసుకుందాం.
దీపికా పదుకొణె
ప్రస్తుతం బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణె వద్ద ల్యాండ్ రోవర్ అల్ట్రా లగ్జరీ ఎస్‌యూవీ రేంజ్ రోవర్ వోగ్ ఉంది. దీని ధర దాదాపు రూ.4 కోట్లుగా ఉంటుంది.

శ్రద్ధా కపూర్
గ్లామరస్ నటి శ్రద్ధా కపూర్ 2023లో ఏకంగా లంబోర్ఘిని హురాకాన్ టెక్నికా అనే సూపర్ స్పోర్ట్స్ కారును కొనుగోలు చేశారు. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.4 కోట్ల కన్నా ఎక్కువ ఉంటుంది. ఈ స్పోర్ట్స్ కారు శ్రద్ధా కపూర్‌కు స్పీడ్, స్టైల్ పట్ల ఉన్న ప్రేమను తెలియజేస్తుంది.

అలియా భట్
మరొక స్టార్ హీరోయిన్ అలియా భట్ లగ్జరీ, సౌకర్యాన్ని కోరుకుంటున్నారు. ఆమె లెక్సస్ ఎల్ఎం 350 హెచ్‌ను ఉపయోగిస్తున్నారు. దీని ధర రూ. 3 కోట్ల కన్నా ఎక్కువ. ఈ అల్ట్రా లగ్జరీ ఎంపీవీ సౌకర్యంగా ఉండడంతో పాటు అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

జాన్వీ కపూర్
అందాల భామ జాన్వీ కపూర్ కూడా లగ్జరీ, సౌకర్యాన్ని కోరుకుంటోంది. ఈ ముద్దు గుమ్మ కూడా లెక్సస్ ఎల్ఎం 350 హెచ్‌ను వినియోగిస్తున్నారు.

కరీనా కపూర్
ఇక సూపర్ స్టార్ నటి కరీనా కపూర్ ఖాన్ విషయానికి వస్తే.. ఆమె వద్ద ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌యూవీ ఉంది, దీని విలువ కూడా రూ. 4 కోట్ల కన్నా ఎక్కువ. అంతేకాకుండా కరీనా గ్యారేజీలో మెర్సిడెస్, ల్యాండ్ రోవర్ డిఫెండర్ వంటి ఇతర లగ్జరీ వాహనాలు కూడా ఉన్నట్లు సమాచారం.

ఊర్వశి రౌటేలా
ఈ జాబితాలో అత్యంత ఖరీదైన కారు ఊర్వశి రౌతేలా వద్ద ఉంది. అది ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన లగ్జరీ ఎస్‌యూవీలలో ఒకటైన రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్. దీని అంచనా ధర సుమారు రూ. 12 కోట్లుగా ఉంది. ఇది ఆమె లగ్జరీ జీవనశైలికి అద్దం పడుతుంది.

కత్రినా కైఫ్
కత్రినా కైఫ్ వద్ద ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఉంది, దీని ధర రూ. 3 కోట్ల కన్నా ఎక్కువ. ఆమె తరచుగా తన భర్త విక్కీ కౌశల్‌తో కలిసి ఈ కారులో కనిపిస్తారు.

కియారా అడ్వాణీ
స్టార్ హీరోయిన్ కియారా అడ్వాణీ వద్ద అత్యంత ఖరీదైన మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్580 ఉంది. దీని ధర రూ.3 కోట్ల కన్నా ఎక్కువ.

కంగనా రనౌత్
కంగనా రనౌత్ వద్ద మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్680 ఉంది. దీని ధర సుమారు రూ. 4 కోట్లుగా ఉంది.

నోరా ఫతేహి
తన డ్యాన్స్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నోరా ఫతేహి వద్ద బీఎండబ్ల్యూ 5 సిరీస్ లగ్జరీ సెడాన్ ఉంది, దీని ధర దాదాపు రూ. 1 కోటిగా ఉంది. ఈ విధంగా బాలీవుడ్ నటీమణులు తమ సినిమాల్లోని పాత్రల మాదిరిగానే, వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీ, స్టైల్‌కు పెద్ద పీట వేస్తున్నారు.

-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications