అప్పుల బాధలు వద్దు: ఈ 50:35:15 బడ్జెట్ సూత్రం పాటిస్తే మీరు కోటీశ్వరులే!

నేటి ఆధునిక జీవనశైలిలో క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లు అవసరంగా మారిపోయాయి. ఆర్థిక ఇబ్బందులు లేని, రుణ విముక్త జీవితం గడపడం ప్రతి ఒక్కరి కల. ప్రస్తుత రోజుల్లో 'బై నౌ - పే లేటర్', 'నో కాస్ట్ ఈఎంఐ' వంటి ఆకర్షణీయమైన ఆఫర్ల వల్ల చాలా మంది యువత తెలియకుండానే అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. నెలకు రూ.50,000 కంటే తక్కువ సంపాదించే వారిలో 93 శాతం మంది తమ రోజువారీ ఖర్చుల కోసం క్రెడిట్ కార్డులపైనే ఆధారపడుతున్నారు. ఈ పరిస్థితిని మార్చుకోవడానికి నిపుణులు 50:35:15 అనే కొత్త బడ్జెట్ సూత్రాన్ని ప్రతిపాదిస్తున్నారు.

ఏమిటీ 50:35:15 బడ్జెట్ రూల్?
మీరు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే నెలవారీ ఆదాయాన్ని మూడు భాగాలుగా విభజించుకోవాలి.

50 శాతం: మీ జీతంలో సగం(50 శాతం) మొత్తాన్ని అద్దె, రేషన్, విద్యుత్ బిల్లులు, పిల్లల చదువు వంటి నిత్యావసరాలకు కేటాయించాలి.

35శాతం రుణాల చెల్లింపునకు: మీ మొత్తం ఈఎంఐలు, అప్పుల చెల్లింపులు ఆదాయంలో 35 శాతం మించకుండా చూసుకోవాలి.

15శాతం పెట్టుబడులకు: భవిష్యత్తు అవసరాల కోసం కనీసం 15శాతం ఆదాయాన్ని పొదుపు లేదా పెట్టుబడి (SIP, PPF మొదలైనవి) చేయాలి.

Debt-Free Life Made Easy Follow the 50 35 15 Budget Rule to Build Wealth

గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు
మీ అన్ని అప్పుల EMIలు కలిపి మీ ఆదాయంలో 35శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. ఒక క్రెడిట్ కార్డ్ బాకీ తీర్చడానికి మరో కొత్త లోన్ లేదా క్రెడిట్ కార్డ్ తీసుకోవడం ప్రమాదకరం. గ్యాడ్జెట్లు లేదా విలాసవంతమైన వస్తువుల కోసం అధిక వడ్డీతో కూడిన రుణాలు తీసుకోవద్దు. ఈఎంఐ చెల్లింపుల్లో జాప్యం చేయకండి. దీనివల్ల భారీ జరిమానాలతో పాటు మీ సిబిల్ (CIBIL) స్కోరు దెబ్బతింటుంది.ఆకస్మిక ఖర్చుల కోసం విడిగా కొంత నగదు ఉంచుకోవాలి. లేదంటే ప్రతి చిన్న అవసరానికి అప్పు చేయాల్సి వస్తుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
ప్రతి నెలా ఆదాయం, ఖర్చుల లెక్కలను ఒక డైరీలో లేదా యాప్‌లో నమోదు చేయండి. అవసరం లేని జిమ్ మెంబర్‌షిప్‌లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు, క్లబ్ ఖర్చులను తగ్గించుకోండి. క్రెడిట్ కార్డ్ బిల్లు మొత్తం కట్టలేకపోయినా, కనీసం 'మినిమం పేమెంట్' అయినా సమయానికి చెల్లించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+