మస్క్ సంచలనం: జీతం ట్రిలియన్ డాలర్లు.. ఆనందం పట్టలేక డ్యాన్స్ (వీడియో)

Elon Musk: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, దిగ్గజ పారిశ్రామిక వేత్త ఎలాన్ మస్క్ సంచలనం సృష్టించారు. చరిత్రలో నిలిచిపోయేలా ఎలాన్ మస్క్ మరో ఘనత సాధించారు. టెస్లా వ్యవస్థాపకుడిగా, సీఈవోగా ఉన్న మస్క్.. అనుకున్నది సాధించారు. ఎలాన్ మస్క్‌కు ట్రిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీ ఇచ్చేందుకు కంపెనీ వాటాదారులు అంగీకరించారు. ఈ క్రమంలో త్వరలోనే ఎలాన్ మస్క్ ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‌గా చరిత్ర సృష్టించే అవకాశాలు ఉన్నాయి.

ప్రపంచ టెక్ దిగ్గజం టెస్లా వాటాదారులు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్‌కు రికార్డుస్థాయిలో 1 ట్రిలియన్ డాలర్లు( రూపాయల్లో సుమారు రూ.83 లక్షల కోట్లు) విలువైన వేతన ప్యాకేజీని భారీ మెజారిటీతో ఆమోదించారు. ఆస్టిన్, టెక్సాస్‌లో గురువారం జరిగిన కంపెనీ వార్షిక సాధారణ సమావేశం (AGM) ఈ సంచలనాత్మక ఆమోదానికి వేదికైంది. ఏజీఎం పూర్తి సందడిగా, ఉల్లాసంగా సాగింది. ఓటింగ్ ఫలితాలు ప్రకటించిన వెంటనే, మస్క్ స్టేజ్‌పైకి వచ్చి టెస్లా రూపొందించిన మానవరూప రోబోట్ అయిన 'ఆప్టిమస్'తో కలిసి డ్యాన్స్ చేసి, సమావేశానికి హాజరైన అభిమానులను, ఇన్వెస్టర్లను ఉర్రూతలూగించారు.

Elon Musk Historic 1 Trillion Pay Deal Approved Tesla CEO Dances in Joy with Optimus Robot

ప్రపంచంలోనే అతిపెద్ద పే ప్యాకేజీ ఆమోదం
ఎలాన్ మస్క్‌కు చెల్లించనున్న ఈ భారీ వేతన ప్యాకేజీని ఏకంగా 75 శాతానికి పైగా సంస్థాగత, రిటైల్ ఇన్వెస్టర్లు బలపరిచారు. ఈ ఆమోదం మస్క్ స్థాయిని మరింత పెంచింది ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్, ఈ ప్యాకేజీలో నిర్దేశించిన అత్యంత ఆశావహ లక్ష్యాలను చేరుకోగలిగితే, చరిత్రలో మొట్టమొదటి ట్రిలియనీర్‌గా అవతరించే అవకాశం ఉంది. ఈ ఒప్పందం ప్రకారం.. మస్క్ వేతనం పూర్తిగా టెస్లా పనితీరుతోనే ముడిపడి ఉంది.

కంపెనీ మార్కెట్ విలువను నేటి 1.5 ట్రిలియన్ డాలర్ల నుండి 8.5 ట్రిలియన్ డాలర్లకు పెంచడం వంటి పలు కఠినమైన ఆర్థిక, కార్యాచరణ మైలురాళ్లను సాధిస్తేనే ఆయనకు ఈ ప్యాకేజీ లభిస్తుంది. ఈ కీలక ప్రకటన వెలువడిన వెంటనే, టెస్లా షేర్లు ఆఫ్టర్-అవర్స్ ట్రేడింగ్‌లో దాదాపు 1 శాతం పెరిగాయని రాయిటర్స్ నివేదించింది.

ఆప్టిమస్‌ రోబోట్‌తో ఉల్లాసభరిత సందడి
ఓటింగ్ ఫలితాలు తన ప్యాకేజీకి అనుకూలంగా రావడంతో ఉబ్బితబ్బిబ్బైన ఎలాన్ మస్క్.. వేదికపైకి వచ్చి అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ వెంటనే టెస్లా హ్యూమనాయిడ్ రోబోట్ అయిన ఆప్టిమస్‌తో కలిసి ఉల్లాసంగా డ్యాన్స్ చేసి, తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మస్క్ ఉద్వేగభరితంగా ప్రసంగిస్తూ, "షేర్‌హోల్డర్ల ఓట్లకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఆమోదాన్ని నేను చాలా అభినందిస్తున్నాను. మేము ఇప్పుడు ప్రారంభించబోయేది కేవలం టెస్లా కథలో ఒక కొత్త అధ్యాయం మాత్రమే కాదు, మొత్తం కొత్త పుస్తకం అవుతుంది. ఇతర కంపెనీల AGMలు నిద్రమత్తును తెప్పిస్తాయి, కానీ మా సమావేశాలు బ్యాంగర్స్ (అద్భుతంగా) ఉంటాయి" అని పేర్కొన్నారు.

మస్క్ ఎదుట దశాబ్దపు సాహసోపేత లక్ష్యాలు
ఈ భారీ వేతన ప్యాకేజీని అందుకోవాలంటే, మస్క్ రాబోయే దశాబ్దంలో ఈ క్రింది సాహసోపేతమైన వృద్ధి లక్ష్యాలను ఛేదించాల్సి ఉంటుంది. ఈ లక్ష్యాలు నెరవేరితే, టెస్లాలో ఆయనకు అదనంగా 12 శాతం వాటా లభించనుంది:

*వాహన డెలివరీ: ప్రతి ఏటా 20 మిలియన్ల (2 కోట్ల) వాహనాలను డెలివరీ చేయాలి.

*రోబోటాక్సీల సంఖ్య: రోడ్డుపై 1 మిలియన్ (10 లక్షల) రోబోటాక్సీలను తీసుకురావాలి.

*హ్యూమనాయిడ్ రోబోట్లు: 1 మిలియన్ (10 లక్షల) ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రోబోట్‌లను విక్రయించాలి.

*ఆర్థిక లక్ష్యం: ఏడాదికి 400 బిలియన్ డాలర్ల వార్షిక లాభాన్ని (Annual Profit) సంపాదించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+