ఉద్యోగం మానేసినా పీఎఫ్ డబ్బులు పెరుగుతాయా? EPFO క్లారిటీ ఇదే!

EPFO New Rules: ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులు తరచుగా ఉద్యోగాలు మారుతుంటారు లేదా వ్యక్తిగత కారణాల వల్ల విరామం తీసుకుంటుంటారు. అటువంటప్పుడు పీఎఫ్ ఖాతాలో జమ అయిన సొమ్ముపై వడ్డీ వస్తుందా రాదా అన్నది పెద్ద ప్రశ్న. ఉద్యోగం మారినప్పుడు లేదా మానేసినప్పుడు చాలామందికి వచ్చే మొదటి సందేహం.. "నా పీఎఫ్ (PF) ఖాతాలో డబ్బులు పెరగడం ఆగిపోతాయా?" అని. దీనిపై ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే, EPFO నిబంధనల ప్రకారం మీరు ఉద్యోగం మానేసినా మీ ఖాతాలోని డబ్బుపై వడ్డీ లభిస్తూనే ఉంటుంది. కానీ ఇందులో కొన్ని ముఖ్యమైన షరతులు ఉన్నాయి.

58 ఏళ్ల వరకు వడ్డీ గ్యారెంటీ
మీరు ఉద్యోగం మానేసినప్పటికీ,, మీ పీఎఫ్ ఖాతాలో ఉన్న సొమ్ముపై 58 ఏళ్ల వయసు వచ్చే వరకు ప్రతి ఏటా వడ్డీ జమ అవుతుంది. ప్రభుత్వం 58 ఏళ్లను రిటైర్మెంట్ వయసుగా పరిగణిస్తుంది. కాబట్టి ఆ వయసు దాటిన తర్వాత మాత్రమే వడ్డీ ఇవ్వడం నిలిపివేస్తారు. అప్పటి వరకు మీరు కొత్తగా డబ్బులు జమ చేయకపోయినా, పాత బ్యాలెన్స్‌పై వడ్డీ పెరుగుతూనే ఉంటుంది.

EPFO New Rules Explained Will PF Balance Earn Interest After Leaving Job

ఖాతా ఎప్పుడు 'ఇన్-యాక్టివ్' అవుతుంది?
ఉద్యోగం మానేసిన తర్వాత 36 నెలల (3 ఏళ్ల) పాటు మీ ఖాతాలో ఎటువంటి కొత్త జమలు జరగకపోతే, ఆ ఖాతాను 'ఇన్-యాక్టివ్'గా పరిగణిస్తారు. సాధారణంగా ఇన్-యాక్టివ్ ఖాతాలపై వడ్డీ రాదు. కాబట్టి పీఎఫ్ ఖాతా ప్రయోజనం పొందాలంటే మీ పాత పీఎఫ్ ఖాతాను కొత్త ఉద్యోగంలోకి బదిలీ చేసుకోవడం లేదా 58 ఏళ్ల లోపే విత్ డ్రా చేసుకోవడం మంచిది.

డబ్బు విత్ డ్రా నియమాల్లో మార్పులు
ఉద్యోగం కోల్పోయిన లేదా మానేసిన వారి కోసం EPFO విత్ డ్రా నిబంధనలను సవరించింది.

*75శాతం విత్ డ్రా: ఉద్యోగం పోయిన వెంటనే మీరు మీ పీఎఫ్ ఖాతాలోని మొత్తంలో 75 శాతాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు.

*మిగిలిన 25శాతం: మిగిలిన 25 శాతం సొమ్మును తీసుకోవాలంటే కనీసం 12 నెలల (ఒక ఏడాది) పాటు నిరుద్యోగిగా ఉండాలి.

*పెన్షన్ (EPS): పెన్షన్ డబ్బులు విత్ డ్రా చేసుకునే కాల పరిమితిని ఇప్పుడు 36 నెలలకు (3 ఏళ్లు) పెంచారు.

మీరు చేయాల్సినవి:
మీ పీఎఫ్ బ్యాలెన్స్, వడ్డీ వివరాల కోసం క్రమం తప్పకుండా UAN పోర్టల్ ద్వారా లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినప్పుడు పాత PF మొత్తాన్ని కొత్త అకౌంట్‌కు బదిలీ చేయండి. దీనివల్ల మీ సర్వీస్ కంటిన్యూ అవుతుంది. మీ పేరు, పుట్టిన తేదీ, ఆధార్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి, తద్వారా విత్ డ్రా సమయంలో ఇబ్బందులు ఉండవు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+