పెట్రోల్, డీజిల్ పై కేంద్రం రివ్యూ- ట్యాక్స్ పెంపు

విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ పై విధించే పన్ను రేట్లను కేంద్ర ప్రభుత్వం తాజాగా పునఃసమీక్షించింది. వీటిపై విధించిన ఎగుమతి పన్నును భారీగా పెంచింది. ముడి చమురు, ఇతర శుద్ధి చేసిన ఇంధన ఉత్పత్తుల సగటు ధరలలో సంభవించిన మార్పులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ సవరించిన రేట్లు తక్షణమే అమలులోకి వచ్చాయి.

పెట్రోల్ ఎగుమతులపై లీటరుకు రూ. 2.50 చొప్పున స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని విధించింది కేంద్రం. ఈ ఎగుమతులపై రోడ్లు, మౌలిక సదుపాయాల కోసం వసూలు చేసే సెస్ జీరోగా నిర్ధారించింది. అంటే.. సెస్ రూపంలో వచ్చే మొత్తాన్ని రోడ్లు వేయడానికి గానీ, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపర్చడానికి గానీ మళ్లించరు. డీజిల్ ఎగుమతులపై అదనపు ఎక్సైజ్ డ్యూటీని లీటరుకు రూ. 8.50 గా ఖరారు చేశారు. ఏవియేషన్ టర్బన్ ఫ్యూయల్ లో ట్యాక్స్ లో మార్పులు చేయలేదు. లీటరుకు రూ. 10.50 ల డ్యూటీని యథాతథంగా కొనసాగిస్తున్నారు.

Export Levies on Petrol Diesel and ATF Revised Fortnightly New Rates Announced by the Central govt

నిన్నటిదాకా ఉన్న రేట్ల కంటే ఇది అధికం. అంతర్జాతీయంగా ముడి చమురు, శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల ధరల్లో సంభవించే మార్పులను సమతుల్యం చేయడానికి కేంద్రం ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ డ్యూటీని సమీక్ష నిర్వహిస్తుంది. ఇదివరకు ఈ నెల 1న చివరిసారిగా దీన్ని సవరించిన విషయం తెలిసిందే. నేటితో ఆ గడువు పూర్తి కావడంతో మరోసారి పునఃసమీక్షించింది. ఈ 15 రోజుల వ్యవధిలో గ్లోబల్ మార్కెట్‌లో నమోదైన సగటు ఇంధన ధరలను పరిగణనలోకి తీసుకుని ఈ తాజా రేట్లను ఖరారు చేశారు.

మీకు భయపడే ప్రసక్తే లేదు: తేల్చి చెప్పిన ముఖేష్ అంబానీ
మీకు భయపడే ప్రసక్తే లేదు: తేల్చి చెప్పిన ముఖేష్ అంబానీ

విదేశీ ఎగుమతి సుంకాల్లో సవరణలు చేసినప్పటికీ, దేశీయంగా విక్రయించే పెట్రోల్, డీజిల్‌పై ఎలాంటి అదనపు భారం పడదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. స్థానిక వినియోగం కోసం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్‌పై ఉన్న ప్రస్తుత ఎక్సైజ్ సుంకాల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఫలితంగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు నమోదు కాలేదు. అవి.. స్థిరంగానే కొనసాగుతున్నాయి.

6జీ ప్రకటించిన జియో: కారు చౌకగా రూ. 4.9కు వన్ జీబీ డేటా: ఆకాష్ అంబానీ
6జీ ప్రకటించిన జియో: కారు చౌకగా రూ. 4.9కు వన్ జీబీ డేటా: ఆకాష్ అంబానీ

ఈ తరహా డ్యూటీని ఈ ఏడాది మార్చి 27న ప్రవేశపెట్టింది.. కేంద్రం. అంతర్జాతీయంగా ముడిచమురు, పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ సగటు ధరల ఆధారంగా ప్రతి 15రోజులకు ఈ రేట్లను సమీక్షిస్తారు. దీనితో పాటు ముడిచమురు ఉత్పత్తిదారులు, ఇంధన ఎగుమతులపై విండ్‌ఫాల్ పన్నును మొదటిసారిగా 2022లో విధించింది కేంద్రం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+