శుభవార్త: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పోటాపోటీ ఆఫర్లు, పలు బ్రాండ్లపై 80% డిస్కాంట్

న్యూఢిల్లీ: ఈ కామర్స్ దిగ్గజ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లు పోటా పోటీగా డిస్కౌంట్ సేల్స్‌ను ప్రకటించాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు పోటా పోటీగా ఈ ఆఫర్లను ప్రకటించాయి. జనవరి 21 నుండి 24 వరకు అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. అయితే జనవరి 21 నుండి 23 వరకు రిపబ్లిక్ డే సేల్స్ ను నిర్వహించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది.

ఈ కామర్స్ దిగ్గజ సంస్థలు పోటా పోటీగా ఆఫర్లతో ముందుకు వచ్చాయి. ఈ రెండు సంస్థలు కూడ ఒకే రోజుల్లో ఈ ఆఫర్లను ప్రకటించాయి. తొలుత అమెజాన్ సంస్థ ఈ ఆఫర్‌ను ముందుకు తీసుకొచ్చింది. అయితే దీనికి పోటీగా ఫ్లిప్ కార్ట్ కూడ రిపబ్లిక్ డే సేల్స్ పేరుతో ముందుకువచ్చింది.

పలు బ్రాండ్లపై ఈ రెండు ఈ కామర్స్ సంస్థలు పోటీలు పడి డిస్కౌంట్లను ప్రకటించాయి. కొన్ని బ్రాండ్లపై ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్లను ప్రకటించాయి. ఈ రెండు సంస్థల మధ్య పోటీ కారణంగా వినియోగదారులకు చౌకగా వస్తువులు లభ్యమయ్యే అవకాశం లేకపోలేదు.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్

జనవరి 21 నుండి 24 వరకు అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ సేల్స్ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకొంది అమెజాన్, ఈ నాలుగు రోజుల్లో వినియోగదారుల నుండి వచ్చిన ఆర్డర్లను నేరుగా వినియోగదారులకు అందించేందుకు వీలుగా సుమారు 6500 మంది తాత్కాలిక ఉద్యోగులను కూడ నియమించుకోవాలని తలపెట్టింది. అయితే కొన్ని బ్రాండ్ల ఉత్పత్తులపై సుమారు 80 శాతం డిస్కౌంట్లను కూడ ఇవ్వనున్నట్టు అమెజాన్ ప్రకటిస్తోంది.

రిపబ్లిక్ డే సేల్స్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్

రిపబ్లిక్ డే సేల్స్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్

రిపబ్లిక్ డే సేల్స్‌ పేరుతో ఫ్లిప్‌కార్డ్ ప్రకటించింది. జనవరి 21 నుండి 23వ, తేది వరకు ఈ ఆఫర్లు ఉంటాయి. అమెజాన్‌ ప్రకటించిన గ్రేట్ ఇండియన్ సేల్స్‌కు ధీటుగా ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్స్ పేరుతో ముందుకు వచ్చింది. పలు రకాల బ్రాండ్లపై భారీ డిస్కౌంట్లను ఇవ్వనున్నట్టు ఫ్లిప్‌కార్డ్ ప్రకటిస్తోంది.

 70 నుండి 80 శాతం డిస్కౌంట్లు

70 నుండి 80 శాతం డిస్కౌంట్లు

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు 70 నుండి 80 శాతం వరకు కొన్ని బ్రాండ్లపై ఆఫర్లను ఇవ్వనున్నట్టు ప్రకటిస్తున్నాయి .ఫ్లిప్‌కార్ట్‌ ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, దుస్తులు, ఫుట్‌వేర్‌, ఫర్నిషింగ్‌పై 80 శాతం డిస్కౌంట్‌ను, టీవీ ఇతర ఉపకరణాలపై 70 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తోంది.

మొబైల్స్‌పై ఆఫర్లు

మొబైల్స్‌పై ఆఫర్లు

పూర్తిగా భారతీయ ఉత్పత్తులతో కూడిన ది ఇండియా స్టోర్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ప్రదర్శిస్తోంది.నూతన స్మార్ట్‌ఫోన్‌ లాంఛ్‌లతో పాటు శాంసంగ్‌, యాపిల్‌, గూగుల్‌ ఫోన్లపై గ్రేట్‌ డీల్స్‌, డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఇదే తరహలో అమెజాన్‌ ఇండియా మొబైల్స్‌, ల్యాప్‌టాప్‌లు, దుస్తులు, ఎలక్ర్టానిక్స్‌, హోం, కిచెన్‌ ఉత్పత్తులపై ఆసక్తికర డీల్స్‌ను ఆఫర్‌ చేస్తోంది.

ప్రైమ్ మెంబర్లకు 12 గంటల ముందే అందుబాటులోకి

ప్రైమ్ మెంబర్లకు 12 గంటల ముందే అందుబాటులోకి

జనవరి 20 నుంచి గ్రేట్‌ ఇండియా సేల్‌లో ప్రైమ్‌ మెంబర్లకు 12 గంటల ముందు గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌ అందుబాటులోకి వస్తుంది. పలు ప్రోడక్ట్‌లకు సంబంధించి పదివేలకు పైగా బ్రాండ్‌లపై భారీ డీల్స్‌ను ఆఫర్‌ చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+