బంగారం ధరల పతనానికి సడన్ బ్రేక్- షార్ప్ రీబౌండ్
దేశంలో పసిడి, వెండి ధరల పతనానికి బ్రేకులు పడ్డాయి. గత కొంతకాలంగా భారీగా ఊరట కలిగిస్తూ వచ్చిన వీటి రేట్లు.. నేడు పుంజుకున్నాయి. స్వల్ప పెరుగుదల నమోదైంది. పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ ధరల మార్పు కొనుగోలుదారులపై ప్రభావం చూపనుంది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటోన్న పరిణామాలు, డాలర్ లో నమోదవుతున్న హెచ్చుతగ్గులు, ఫెడరల్ బ్యాంక్ నిర్ణయాలు దీనికి కారణం అయ్యాయి.
సోమవారం నాటి ముగింపు సెషన్ తో పోల్చుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో 160 రూపాయల నామమాత్రపు పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్లు 150, 18 క్యారెట్లు 120 రూపాయల మేర పెరిగింది. ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు 1,56,930 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,43,850 వద్ద ట్రేడ్ అయింది.

ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు అలాగే సురక్షితమైన దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా బంగారం ఎల్లప్పుడూ మొదటి వరుసలో ఉంటుంది. మార్కెట్లలో నెలకొన్న అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు, రూపాయి విలువలో వచ్చే హెచ్చుతగ్గుల కారణంగా పెట్టుబడిదారులు స్థిరమైన లాభాల కోసం పసిడి వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల మార్కెట్లో నిరంతరం డిమాండ్ పెరుగుతూ వస్తోంది.
హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,56,930, 22 క్యారెట్లు రూ. 1,43,850 18 క్యారెట్లు రూ. 11,773 గా రికార్డయింది. బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,56,930, 22 క్యారెట్లు రూ.1,43,850, 18 క్యారెట్లు రూ. 1,17,730 పలుకుతోంది. చెన్నైలో ఇవే రేట్లు వరుసగా 1,56,930, రూ. 1,43,850, 1,21,550 గా రికార్డయ్యాయి. ముంబైలో రూ. 1,56,930, రూ. 1,43,850 రూ. 11,770 వద్ద కొనసాగుతున్నాయి.
వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,693, 22 క్యారెట్లు - రూ. 14,385, 18 క్యారెట్లు - రూ. 12,155
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,693, 22 క్యారెట్లు- రూ. 14,385, 18 క్యారెట్లు - రూ. 11,770
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,693, 22 క్యారెట్లు- రూ. 14,385, 18 క్యారెట్లు - రూ. 11,773
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,693, 22 క్యారెట్లు- రూ. 14,385, 18 క్యారెట్లు - రూ. 11,773
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,693, 22 క్యారెట్లు- రూ. 14,385, 18 క్యారెట్లు - రూ. 11,773
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,693, 22 క్యారెట్లు- రూ. 14,385, 18 క్యారెట్లు - రూ. 11,773












Click it and Unblock the Notifications