పసిడి ప్రియులకు బిగ్ షాక్.. మరీ ఇంతా ?!
దేశంలో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. వాటి ధరలు పెగడం వరుసగా ఇది అయిదో రోజు. కిందటివారం నుంచీ క్రమం తప్పకుండా జంప్ చేస్తూనే వస్తోన్నాయి బంగారం, వెండి ధరలు. స్పాట్ మార్కెట్‌లో కొనుగోలు డిమాండ్ పెరగడం ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,61,890, 22 క్యారెట్లు 1,48,400 రూపాయల వద్ద లభిస్తోంది. మంగళవారం నాటితో పోల్చుకుంటే 0.31 శాతం పెరుగుదల చోటు చేసుకుంది.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,60,460కి చేరుకుంది. అదేవిధంగా, వెండి ధర 2.12 శాతం పెరుగుదలతో కిలోకు రూ. 2,66,263కి ఎగబాకింది. కిందటి నెలలో బంగారం 10 గ్రాములకు రూ. 1,80,000 ఆల్‌టైమ్ హై, వెండి కిలోకు రూ. 4,20,000తో రికార్డు స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఆ తరువాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు మళ్లీ అదే బాట పట్టాయి.

ఢిల్లీ, జైపూర్‌లలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,62,040, 22 క్యారెట్లు రూ. 1,48,550గా నమోదయ్యాయి. అహ్మదాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం రూ. 1,61,940 కాగా, 22 క్యారెట్లు రూ. 1,48,450 వద్ద లభించింది. పూణే, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి ఆరు నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,61,890గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,48,400గా నమోదైంది.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 16,288, 22 క్యారెట్లు - రూ. 14,930, 18 క్యారెట్లు - రూ. 12,765
ముంబై..
24 క్యారెట్లు - రూ. 16,189, 22 క్యారెట్లు- రూ. 14,840, 18 క్యారెట్లు - రూ. 12,142
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 16,189, 22 క్యారెట్లు- రూ. 14,840, 18 క్యారెట్లు - రూ. 12,142
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 16,189, 22 క్యారెట్లు- రూ. 14,840, 18 క్యారెట్లు - రూ. 12,142
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 16,189, 22 క్యారెట్లు- రూ. 14,840, 18 క్యారెట్లు - రూ. 12,142
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 16,189, 22 క్యారెట్లు- రూ. 14,840, 18 క్యారెట్లు - రూ. 12,142
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications