కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం
అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు విఫలమైన ప్రభావం బంగారం, వెండి ధరలపై తీవ్రంగా పడింది. వీటి రేట్లల్లో భారీ క్షీణత కనిపించింది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి దిగ్బంధనం భయాలు, ప్రపంచ ఇంధన ధరల పెరుగుదల వంటివి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను గందరగోళంలో పడేశాయి. ఈ అనిశ్చితి మధ్య, బంగారం, వెండి ధరలు దాదాపు మూడు శాతం వరకు పడిపోయాయి. అంతర్జాతీయంగా కామెక్స్ లో స్పాట్ బంగారం ధర 0.6 శాతం తగ్గి ఔన్స్‌కు 4,718.98 డాలర్ల వద్ద వద్ద స్థిరపడింది.
ఇది ఏప్రిల్ 7 తర్వాతి కనిష్ట స్థాయి. జూన్ డెలివరీ కోసం యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ ఒక శాతం పతనమై 4,742 డాలర్లకు పడిపోయాయి. వెండి రేటు కూడా భారీగా పతనమైంది. 3.29 శాతం పడిపోయి, ప్రతి ఔన్స్‌కు 74 డాలర్లకు తగ్గింది. బంగారం, వెండి ధరల పతనానికి ప్రధాన కారణం బ్రెంట్ ముడి చమురు ధరల పెరుగుదల. బ్యారెల్‌కు చమురు ధర 8.4 శాతం వృద్ధితో 103.24 డాలర్లకు చేరింది. చమురు ధరల పెరుగుదల రవాణా, ఉత్పత్తి, విద్యుత్ వంటి అన్ని రంగాల ఖర్చులను పెంచుతుంది. ఇది ద్రవ్యోల్బణం భయాన్ని అధికం చేస్తుంది.

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం 0.5 శాతం తగ్గి, 10 గ్రాములకు రూ. 1,51,900 వద్ద ట్రేడ్ అయింది. వెండి ధర 1.97 శాతం పడిపోయి కిలోకు రూ. 2,38,486కి చేరింది. ముంబైలో వెండి స్పాట్ ధర కిలోకు రూ. 2,60,000గా నమోదైంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,52,830, 22 క్యారెట్లు రూ. 1,40,090 పలుకుతోంది. పుణె, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ, జైపూర్‌లలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,52,980, 22 క్యారెట్లు రూ. 1,40,240గా నమోదైంది.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,338, 22 క్యారెట్లు - రూ. 14,060, 18 క్యారెట్లు - రూ. 11,730
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,246, 22 క్యారెట్లు- రూ. 13,975, 18 క్యారెట్లు - రూ. 11,434
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,246, 22 క్యారెట్లు- రూ. 13,975, 18 క్యారెట్లు - రూ. 11,434
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,246, 22 క్యారెట్లు- రూ. 13,975, 18 క్యారెట్లు - రూ. 11,434
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,246, 22 క్యారెట్లు- రూ. 13,975, 18 క్యారెట్లు - రూ. 11,434
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,246, 22 క్యారెట్లు- రూ. 13,975, 18 క్యారెట్లు - రూ. 11,434

Click it and Unblock the Notifications