అక్షయ తృతీయకు బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా: ఇదే రైట్ టైం
దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై ఆశలు చిగురించడం, లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా-ఇరాన్ తదుపరి సమావేశంపై చేసిన ప్రకటనలు ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెరుగుదల భయాలను తగ్గించింది. ఇవి మార్కెట్‌ను ప్రభావితం చేశాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ధర 0.04 శాతం తగ్గింది. 10 గ్రాములకు రూ. 1,53,220కి చేరింది. వెండి ధరలో పెరుగుదల కనిపించింది. 0.58 శాతం వృద్ధిని అందుకుంది. కిలో రూ. 2,50,059లుగా నమోదైంది.
ముంబై మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,55,580 రూపాయలకు చేరింది. 22 క్యారెట్లు 1,42,610 రూపాయలకు ట్రేడ్ అవుతోంది. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలు కొన్ని వ్యత్యాసాలతో నమోదయ్యాయి. ఢిల్లీ, జైపూర్‌లలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,42,710, 24 క్యారెట్లు రూ. 1,55,730గా ఉంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పుణె, ముంబై, కోల్‌కతా వంటి నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రూ. 1,42,610, 24 క్యారెట్లు రూ. 1,55,580కి లభిస్తోంది.

అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,789.67 డాలర్ల వద్ద స్థిరంగా కొనసాగింది. ఈ వారం మొత్తానికీ 0.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. జూన్ డెలివరీకి సంబంధించిన అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 4,809.30 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యాయి. స్పాట్ సిల్వర్ ఔన్సుకు 79 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇది దాదాపు ఒకశాతానికి పైగా పెరిగే అవకాశం ఉంది. అమెరికా, ఇరాన్‌ల మధ్య శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుందని పెట్టుబడిదారులు ఆశిస్తున్నారు. దీనివల్ల ఇంధన సంక్షోభం, ద్రవ్యోల్బణ ఒత్తిడి ఆందోళనలు తగ్గుతాయని భావిస్తున్నారు.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,502, 22 క్యారెట్లు - రూ. 14,210, 18 క్యారెట్లు - రూ. 11,860
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,420, 22 క్యారెట్లు- రూ. 14,135, 18 క్యారెట్లు - రూ. 11,565
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,420, 22 క్యారెట్లు- రూ. 14,135, 18 క్యారెట్లు - రూ. 11,565
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,420, 22 క్యారెట్లు- రూ. 14,135, 18 క్యారెట్లు - రూ. 11,565
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,420, 22 క్యారెట్లు- రూ. 14,135, 18 క్యారెట్లు - రూ. 11,565
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,420, 22 క్యారెట్లు- రూ. 14,135, 18 క్యారెట్లు - రూ. 11,565

Click it and Unblock the Notifications