Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నమ్మశక్యం కాని విధంగా మళ్లీ కుప్పకూలుతున్న బంగారం ధరలు

రెండురోజుల పాటు భారీగా ఎగిసిన బంగారం ధరల దూకుడు మళ్లీ తగ్గింది. పసిడి రేట్లు నేడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. భారీ పతనం కనిపించింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర అస్థిరతను చవిచూశాయి. అమెరికా ఈక్విటీలలో చోటుచేసుకున్న భారీ హెచ్చుతగ్గుల కారణంగా మార్కెట్ గోల్డ్ క్యాపిటలైజేషన్‌లో దాదాపు తొమ్మిది ట్రిలియన్ల డాలర్ల మేర భారీ కదలిక నమోదైంది. ఈ పరిణామం అనిశ్చితికి దారి తీసింది.

ఈ ఉదయం దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో బంగారం ధర తగ్గు్ముఖం పట్టింది. లాభాల స్వీకరణ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సడలడం, డాలర్ సూచీలో భారీ పెరుగుదల దీనికి ప్రధాన కారణాలు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో గోల్డ్ ఫ్యూచర్స్ దాదాపు మూడు శాతం మేర అంటే 4,600 రూపాయలు పడిపోయింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,48,455కి చేరింది. అదేవిధంగా, సిల్వర్ రేట్లు కూడా తగ్గాయి. సుమారు 9 శాతం క్షీణించింది. రూ. 24,200 పతనమైంది. కిలోకు 2,44,654 వద్ద ట్రేడ్ అయింది.

Gold falls at MCX profit booking amid easing geopolitical tensions analysts highlight must watch levels

అమెరికా, ఇరాన్‌లు శుక్రవారం ఒమన్‌లో చర్చలు జరపడానికి అంగీకరించినట్లు నివేదికలు రావడంతో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ లో నేటి సెషన్‌లో బంగారం ఔన్స్ ధర 4,770 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బంగారం, వెండి ధరల ట్రెండింగ్ పై పృథ్వీ ఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్ విశ్లేషకుడు మనోజ్ కుమార్ జైన్ తన అభిప్రాయాలను వెల్లడించారు. గోల్డ్‌కు రూ. 1,47,700- రూ.1,50,500 వరకు ట్రేడ్ అవ్వొచ్చని, దీని స్టాప్ లాస్‌తో రూ. 1,56,800 వరకు ఉంటుందని పేర్కొన్నారు.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 16,622, 22 క్యారెట్లు - రూ. 14,320, 18 క్యారెట్లు - రూ. 12,250

ముంబై..

24 క్యారెట్లు - రూ. 15,442, 22 క్యారెట్లు- రూ. 14,155, 18 క్యారెట్లు - రూ. 11,582

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 15,442, 22 క్యారెట్లు- రూ. 14,155, 18 క్యారెట్లు- రూ. 11,582

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 15,442, 22 క్యారెట్లు- రూ. 14,155, 18 క్యారెట్లు- రూ. 11,582

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 15,442, 22 క్యారెట్లు- రూ. 14,155, 18 క్యారెట్లు- రూ. 11,582

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 15,442, 22 క్యారెట్లు- రూ. 14,155, 18 క్యారెట్లు- రూ. 11,582

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+