సంక్రాంతి వేళ బంగారం ధరలు అనూహ్యంగా.. !!

బంగారం ధరల్లో ఏ మాత్రం తగ్గుదల కనిపించట్లేదు. ప్రతి రోజూ పెరుగుతూనే ఉన్నాయి. అందనంత ఎత్తుకు చేరుకుంటోన్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు పెరగడం, డాలర్ పతనం, ఈ ఏడాది యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అవకాశాలు వంటి అంశాలతో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మళ్ళారు. దీని ఫలితంగా, బంగారం, వెండి ధరలు నేడు ఎంసీఎక్స్ మార్కెట్‌లో రికార్డుస్థాయికి చేరాయి. గరిష్ఠ రేటును నమోదు చేశాయి.

24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,43,017, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,31,020 వద్ద నిలిచింది. మల్టీ-కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ఫ్యూచర్స్ రూ. 1,43,010 వద్ద రెడ్‌లో ట్రేడ్ అయ్యాయి. వెండి ఫ్యూచర్స్ కిలోకు 0.25 శాతం పెరిగి రూ. 2,83,725కి చేరుకున్నాయి. అంతర్జాతీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ఏడు శాతం పైగా పెరిగి కొత్త రికార్డులను సృష్టించాయి. బంగారం దాదాపు రెండు శాతం ఎగబాకి ఔన్స్‌కు 4,600 డాలర్ కు చేరువ కాగా, వెండి 2.35 శాతం పెరిగి ఔన్స్‌కు 85 డాలర్ వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది.

Gold Lingers at Rs 1 43 Lakh per 10g Silver Jumps 3 on MCX

ఢిల్లీ, జైపూర్‌లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 1,31,1100, 24 క్యారెట్ల బంగారం రూ. 1,43,1150గా ఉన్నాయి. అహ్మదాబాద్, పుణేలలో 22 క్యారెట్ల బంగారం రూ. 1,30,400, 24 క్యారెట్ల బంగారం రూ. 1,43,050గా నమోదయ్యాయి. ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 1,31,115, 24 క్యారెట్ల బంగారం రూ. 1,43,130గా స్థిరపడింది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 14,488, 22 క్యారెట్లు - రూ. 13,280, 18 క్యారెట్లు - రూ. 11,080

ముంబై..

24 క్యారెట్లు - రూ. 14,362, 22 క్యారెట్లు- రూ. 13,165, 18 క్యారెట్లు - రూ. 10,772

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 14,362, 22 క్యారెట్లు- రూ. 13,165, 18 క్యారెట్లు- రూ. 10,772

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 14,362, 22 క్యారెట్లు- రూ. 13,165, 18 క్యారెట్లు- రూ. 10,772

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 14,362, 22 క్యారెట్లు- రూ. 13,165, 18 క్యారెట్లు- రూ. 10,772

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 14,362, 22 క్యారెట్లు- రూ. 13,165, 18 క్యారెట్లు- రూ. 10,772

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+